MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman73bbe631-e1d4-420a-9f06-ce921b214ba2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/thaman73bbe631-e1d4-420a-9f06-ce921b214ba2-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఎక్కువ మంది టాప్ సంగీత దర్శకులు లేకపోయినా ఇద్దరి పేర్లు మాత్రం టాలీవుడ్ సర్కిల్ లో ఎక్కువగా వినిపిస్తాయి.. వారే దేవి శ్రీ ప్రసాద్, తమన్ లు.. వీరిద్దరే ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ హీరోలకు సంగీతం సమకూరుస్తున్నారు.. ఎప్పుడో కానీ మూడో సంగీత దర్శకుడు ఎంటర్ అవ్వడు.వీరిద్దరి మధ్య నెంబర్ వన్ స్థానం మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్.ఎస్.తమన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు... thaman;pawan;mahesh;rajinikanth;geetha;pawan kalyan;prasad;thaman s;tollywood;cinema;sangeetha;youtube;you tube;director;music;leaderఅవి పట్టించుకోను.. విమర్శలపై తమన్ షాకింగ్ కామెంట్స్..?అవి పట్టించుకోను.. విమర్శలపై తమన్ షాకింగ్ కామెంట్స్..?thaman;pawan;mahesh;rajinikanth;geetha;pawan kalyan;prasad;thaman s;tollywood;cinema;sangeetha;youtube;you tube;director;music;leaderSat, 06 Mar 2021 21:00:00 GMTటాలీవుడ్ లో ఎక్కువ మంది టాప్ సంగీత దర్శకులు లేకపోయినా ఇద్దరి పేర్లు మాత్రం టాలీవుడ్ సర్కిల్ లో ఎక్కువగా వినిపిస్తాయి.. వారే దేవి శ్రీ ప్రసాద్, తమన్  లు.. వీరిద్దరే ఒకరి తర్వాత ఒకరు టాలీవుడ్ హీరోలకు సంగీతం సమకూరుస్తున్నారు.. ఎప్పుడో కానీ మూడో సంగీత దర్శకుడు ఎంటర్ అవ్వడు.వీరిద్దరి మధ్య నెంబర్ వన్ స్థానం మారుతూ ఉంటుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ లో  నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ఎస్.ఎస్.తమన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు...

వరుస హిట్ ఆల్బమ్స్ తో ఒక్కసారిగా టాప్ పొజిషన్ లోకి వచ్చాడు.. దేవి శ్రీ ప్రసాద్ తో ఆరోగ్యకరమైన పోటీ ఉన్నప్పటికీ తమన్ తన మ్యూజిక్ తో ఈనాడు అభిమానులని నిరాశపరచలేదు.. గత సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠపురం సినిమా తో తమన్ కి టాప్ ప్లేస్ దక్కింది.. ఆ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్.. ఇప్పటికే ఎక్కడ చూసిన ఆపాటలు మార్మోగిపోతుంటాయి.. యూట్యూబ్ లో రోజూ ఎదో ఒక రికార్డును క్రియేట్ చేస్తుంటాయి.. ఈ దశాబ్దంలో ఇంత ఘనంగా హిట్ అయిన పాటలు ఈ సినిమాలోనివే కావచ్చు..

అయితే ఎన్ని హిట్ పాటలు ఇచ్చినా తమన్ కి కాపీ ట్యూన్ చేస్తున్నాడు అనే విమర్శలు తగ్గట్లేవు. ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ `సర్కారు వారి పాట`కు కూడా తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ అభిమాని ఆ సినిమా అప్‌డేట్ గురించి అడిగాడు. దానికి స్పందించిన తమన్.. ``సర్కారు వారి పాట` నుంచి తప్పకుండా మీకెన్నో సర్‌ప్రైజ్‌లు వస్తాయి. ఆ సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. కాబట్టి, సర్‌ప్రైజ్‌లు కోసం కొంత సమయం వేచి ఉండండి. ఆగస్టులో తప్పకుండా మనం కలుసుకుందాం  అని తమన్ పేర్కొన్నాడు. అలాగే తన సంగీతంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. `అలాంటి వాటి గురించి పట్టించుకుని నా సమయాన్ని వృథా చేసుకోను. నా సంగీతంపై ట్రోల్స్ క్రియేట్ చేయడం కోసం వారే తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నార`ని చెప్పాడు. అలాగే తన దృష్టిలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ `ఒక నిజమైన లీడర్` అని చెప్పాడు.


కాసులు కురిపిస్తున్న చెత్త..ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ గ్రామం.!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>