PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/balakrishna-campaign-in-hindupur-municipalitya75e7ea6-3556-4309-9391-b47cbefad644-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/balakrishna-campaign-in-hindupur-municipalitya75e7ea6-3556-4309-9391-b47cbefad644-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ మున్సిపల్ ప్రచార రంగంలోకి దిగారు. పంచాయతీల విషయంలో ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నా.. పార్టీ గుర్తుపై జరిగే మున్సిపాల్టీల విషయంలో బాలయ్యని కూడా రంగంలోకి దించారు బావ చంద్రబాబు. అయితే బాలయ్య ప్రచారంపై అప్పుడే వ్యతిరేక ప్రచారం మొదలైంది. తనతోపాటు ప్రచారానికి వచ్చిన నాయకులపై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని, ఆయన వాహనం వెంట ఎవరూ ఉండటంలేదని, అసలు బాలయ్య ప్రచారానికి జనమే కరువయ్యారంటూ వైసీపీ అనుకూల మీడియా వార్తలు ఇస్తోంది. bala krishna, balayya, hindupur,;balakrishna;tara;vishakapatnam;nandamuri balakrishna;media;panchayati;hindupuram;tdp;ycp;nandamuri taraka rama rao;partyపురపోరు: బాలయ్య ప్రచారంపై మొదలైన దుష్ప్రచారం..పురపోరు: బాలయ్య ప్రచారంపై మొదలైన దుష్ప్రచారం..bala krishna, balayya, hindupur,;balakrishna;tara;vishakapatnam;nandamuri balakrishna;media;panchayati;hindupuram;tdp;ycp;nandamuri taraka rama rao;partySat, 06 Mar 2021 12:00:00 GMTనందమూరి బాలకృష్ణ మున్సిపల్ ప్రచార రంగంలోకి దిగారు. పంచాయతీల విషయంలో ప్రచారానికి కాస్త దూరంగా ఉన్నా.. పార్టీ గుర్తుపై జరిగే మున్సిపాల్టీల విషయంలో బాలయ్యని కూడా రంగంలోకి దించారు బావ చంద్రబాబు. అయితే బాలయ్య ప్రచారంపై అప్పుడే వ్యతిరేక ప్రచారం మొదలైంది. తనతోపాటు ప్రచారానికి వచ్చిన నాయకులపై ఆయన చిర్రుబుర్రులాడుతున్నారని, ఆయన వాహనం వెంట ఎవరూ ఉండటంలేదని, అసలు బాలయ్య ప్రచారానికి జనమే కరువయ్యారంటూ వైసీపీ అనుకూల మీడియా వార్తలు ఇస్తోంది.


వాస్తవం ఏంటి..?
హిందూపురంలో బాలకృష్ణ ఎప్పుడు పర్యటించినా జనం భారీగానే హాజరవుతారు. అయితే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆయన మూడు రోజులుగా అక్కడే మకాం వేశారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోనూ కలియదిరుగుతున్నారు. ఈ సందర్భంలో జన సమీకరణ కూడా ఎండల్లో సాధ్యమయ్యే పనికాదు. అయితే బాలయ్యకు ప్రజాదరణ లేదని చెప్పడం సరికాదని అంటున్నాయి పార్టీ వర్గాలు.

మరోవైపు బాలయ్య తన ప్రచారంలో అధికార పక్షంపై విరుచుకుపడుతున్నారు. ‘పాలక పక్షం వారు అధికార దర్పంతో జనాన్ని బెదిరిస్తున్నారు. దళారులను అడ్డంపెట్టుకొని రైతుల నుంచి అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. అవకాశం వస్తే పంచభూతాలను సైతం అమ్మేస్తారు. ఇలాంటి వారికి మున్సిపల్‌ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి’ అని హిందూపురంలో పిలుపునిచ్చారు బాలకృష్ణ. ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయకపోతే పింఛన్లు నిలిపేస్తామని బెదిరించే వారిని నిలదీయాలని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలని, పాలకపక్షం వారికి కర్మాగారం, కారాగారానికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఓట్లు అడగటానికి వచ్చే వైసీపీ నాయకులను రెండేళ్లు ఏం అభివృద్ధి చేశారని నిలదీయాలని చెప్పారు. రోడ్ షో తోపాటు, పలుచోట్ల నడుచుకొంటూ వెళ్లి ఓటర్ల మద్దతు కోరారు బాలకృష్ణ.

మొత్తమ్మీద కుప్పం నియోజకవర్గ పరిధిలో పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేక ఫలితాలతో చంద్రబాబు అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. కనీసం టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచిన ప్రాంతాల్లో అయినా మున్సిపాల్టీల్లో పరువు దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారు బాబు. అందుకే నాయకుల్ని ప్రచారంలోకి దించారు.





బాలయ్య చిన్న మనవడి అక్షరాభ్యాసం.. టెన్షన్ లో ఫ్యాన్స్ !

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>