Politicssangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-sharmilae5facbc9-52de-45c8-a92f-fabf9added6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-sharmilae5facbc9-52de-45c8-a92f-fabf9added6a-415x250-IndiaHerald.jpg ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలంగాణలో తెలంగాణేతర నేతలు అడుగుపెడుతామని చెప్పడంతో వారికి ఎలాంటి ఆదరణ ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణ గడ్డపై రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు షర్మిల సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత పార్టీ పేరు, విధి విధానాలను ప్రకటించనున్నారు షర్మిల. pawan,sharmila;pawan;pawan kalyan;bharatiya janata party;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;janasena;congress;janasena party;partyతెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి..?తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి..?pawan,sharmila;pawan;pawan kalyan;bharatiya janata party;telangana rashtra samithi trs;andhra pradesh;telangana;janasena;congress;janasena party;partySat, 06 Mar 2021 02:00:00 GMTతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. అలాంటి తెలంగాణ లో ఇక్కడి మూలాలు లేని ఇద్దరు నేతలు రంగంలోకి దిగుతున్నారు. తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో రాజన్న రాజ్యం కోసం షర్మిల కొత్త పార్టీతో వస్తుంది. అయితే ఇదే తరుణంలో జనసేన కూడా తెలంగాణ లో క్రియాశీలంగా  ఉండాలని డిసైడ్ అయింది. వీళ్ల రాకతో తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అలాగే తెలంగాణ రాజకీయాల్లో పవన్, షర్మిల ప్రభావం ఎంత? ఈ విషయం గురించి తెలుసుకుందాం.


 ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలంగాణలో తెలంగాణేతర నేతలు అడుగుపెడుతామని చెప్పడంతో వారికి ఎలాంటి ఆదరణ ఉంటుందనే చర్చ మొదలైంది. తెలంగాణ గడ్డపై రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు షర్మిల సిద్ధమయ్యారు. పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తున్నారు. జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత పార్టీ పేరు, విధి విధానాలను ప్రకటించనున్నారు షర్మిల.


షర్మిల రాజకీయ ప్రకటనపై రకరకాల విశ్లేషణలు, చర్చలు జరుగుతుండగానే పవన్ కల్యాణ్ కూడా తెలంగాణలో పార్టీ విస్తరణ ప్రకటన చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు.మరోవైపు తెలంగాణ జనసేన మహిళా అభిమానులతో పవన్ కల్యాణ్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా  తెలంగాణలో పార్టీ కార్యక్రమాలు యాక్టివ్ గా నిర్వహించడం, పార్టీ విస్తరణ చేయకపోవడంపై మహిళలు పవన్‌ను ప్రశ్నించారు. దీంతో అప్పటికప్పుడు పవన్ కల్యాణ్ ఇకపై తెలంగాణలో కూడా పార్టీ కార్యక్రమాలు చేపడతామని ప్రకటించేశారు. 2014కు ముందు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో హైదరాబాద్‌లో పార్టీ ఏర్పాటు చేశారు.
పార్టీ పెట్టినా ఆ ఎన్నికల్లో కానీ ఆ తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో గానీ జనసేన తెలంగాణలో పోటీ చేయలేదు. తన దృష్టంతా ఏపీ మీదనే అన్నట్టు ఆ పార్టీ నడిచింది.ఏపీలో బీజేపీతో పొత్తుతో ఉన్న జనసేనాని తెలంగాణలో కూడా ఆ పార్టీతోనే కలిసిపోవాల్సి ఉంటుంది. అందుకు తెలంగాణ బీజేపీ అంగీకరిస్తుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వయంపాలన కోసం తెలంగాణ తెచ్చుకుంటే పక్క రాష్ట్రం నుంచి పవన్ కల్యాణ్ ను తెచ్చుకున్నారని టీఆర్ఎస్, ఇతర పార్టీలు ఆరోపణలు చేసే ప్రమాదం ఉంది.


తెలంగాణలో పవన్ ప్రయాణం ఒంటరిగా ఉంటుందా బీజేపీతో కలిసే ఉంటుందా? అనేది చూడాలి. ఎందుకంటే గతంలో పవన్‌ కల్యాణ్‌ చాలా సందర్భాల్లో కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు బీజేపీతో కలిసి జనసేన తెలంగాణలో నడవాల్సి వస్తే అందుకు భిన్నమైన స్టాండ్‌ను పవన్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇటు షర్మిల రాజకీయ పార్టీపై ఇప్పటికే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. పక్క రాష్ట్రం వారి నాయకత్వం తమకు అవసరం లేదంటున్నాయి. వాటికి దీటుగా తాను తెలంగాణ కోడల్ని అంటూ ముందుకు వెళ్లాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క తెలంగాణ చాంపియన్ అని చెప్పుకుంటున్న టీఆర్ఎస్, ఇంకోవైపు తెలంగాణ ఇచ్చింది మేమేనని చెప్పినా రెండుసార్లూ గెలవలేకపోయిన కాంగ్రెస్, ఇంకోవైపు ఇలాగైనా ఈసారి గెలవాలనుకుంటున్న బీజేపీ. ఇన్ని పార్టీల మధ్య ఆత్మగౌరవం, విధులు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో షర్మిలకు ఆదరణ ఎలా ఉంటుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.


హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అంటే ఏమిటి..?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>