PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram-have-super-chance-a98dafee-f6ab-4842-b974-d71ab8e85b8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram-have-super-chance-a98dafee-f6ab-4842-b974-d71ab8e85b8d-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రచారంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు. ఒకవేళ అలా పాల్గొన్నట్టయితే ఎన్నికల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎక్కడా దీనికి సంబంధించిన కేసులు నమోదు అయిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపjagan nimmagadda elections;kumaar;sriram;telugu desam party;district;telugu;police;minister;dharmavaram;tdp;traffic police;paritala ravindra;party;paritala sunithaపుర పోరు : పరిటాల మీద కేసులు.. మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు !పుర పోరు : పరిటాల మీద కేసులు.. మండిపడుతున్న తెలుగు తమ్ముళ్లు !jagan nimmagadda elections;kumaar;sriram;telugu desam party;district;telugu;police;minister;dharmavaram;tdp;traffic police;paritala ravindra;party;paritala sunithaSat, 06 Mar 2021 11:00:00 GMTఅనంతపురం జిల్లా తెలుగు తమ్ముళ్లు అధికార పార్టీ మీద, ప్రభుత్వం మీద విరుచుకు పడుతున్నారు. దానికి కారణం లేకపోలేదు విషయం ఏమిటంటే కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రచారంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదు. ఒకవేళ అలా పాల్గొన్నట్టయితే ఎన్నికల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎక్కడా దీనికి సంబంధించిన కేసులు నమోదు అయిన దాఖలాలు లేవు. కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణల మీద మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు టీడీపీ యువనేత పరిటాల శ్రీరామ్ మీద అనంతపురం జిల్లాలో కేసు నమోదయింది. 

ప్రస్తుతం తెలుగుదేశం నాయకత్వం ఆయనను ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జ్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ధర్మవరం మున్సిపాలిటీ కి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆయన విరివిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వాస్తవానికి శ్రీరామ్ రాష్ట్ర స్థాయి నేత కావడంతో పెద్ద ఎత్తున ఆయన వెంట జనం తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా సరే ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఆయన చాలా తక్కువ మందిని తన వెంట తీసుకు వెళుతున్నారు. 

అయితే ధర్మవరంలో పదో వార్డు లో ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మసీదు దగ్గరలో ఐదుగురు కంటే ఎక్కువ మంది తన ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెబుతూ అక్కడి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అధికారి నాగవల్లి ధర్మవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద పరిటాల శ్రీరామ్ తో పాటు ఏడుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో నిబంధనలు తమకు మాత్రమే వర్తిస్తాయా ? అధికార పార్టీ వారికి వర్తించవా అంటూ తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు.




కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>