PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp9d51a85e-d917-4922-ac42-f48f75901e5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp9d51a85e-d917-4922-ac42-f48f75901e5f-415x250-IndiaHerald.jpgనువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న విశాఖ మేయర్ ఎన్నికలలో అధికార వైసీపీకి బిగ్ షాక్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ విశాఖ పీఠం మాదేనని గట్టిగానే ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు తీసుకున్న వారు అంతా తమకు మద్దతుగా నిలబడతారని లెక్కలు వేసుకుంటోంది. ycp;korea, south;vishakapatnam;ycp;partyపుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?ycp;korea, south;vishakapatnam;ycp;partySat, 06 Mar 2021 09:39:26 GMTవిశాఖ మేయర్ ఎన్నికలలో  అధికార వైసీపీకి బిగ్ షాక్ తప్పదా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ విశాఖ పీఠం మాదేనని గట్టిగానే ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు తీసుకున్న వారు అంతా తమకు మద్దతుగా నిలబడతారని లెక్కలు వేసుకుంటోంది.

అయితే ఈ లెక్కలు అంచనాలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే వైసీపీకి అతి పెద్ద తలనొప్పిగా రెబెల్స్ తయారు అయ్యారు. వారి ఒకరూ ఇద్దరూ లేరు. ఏకంగా పది మంది దాకా వైసీపీ ఆశలపైన వేటు వేసేలా ఉన్నారు. వీరే చివరికి వైసీపీ కొంప ముంచనున్నారు అని కూడా అంటున్నారు. మరి వీరి విషయంలో వైసీపీ అధినాయకత్వం ఏం చేస్తోంది అంటే అసలు పట్టించుకోవడంలేదు. దాంతో రెబెల్స్ గా పోటీ చేస్తున్న వారు ఎన్నికల రంగాన దూసుకుపోతున్నారు. వారు చీల్చేది కచ్చితంగా వైసీపీ ఓట్లే. వారి వల్ల నష్టం జరిగేది కూడా వైసీపీ అభ్యర్ధులకే. విశాఖ సౌత్ లో, గాజువాకలో, అలాగే  భీమిలీ నియోజకవర్గంలో దాదాపు పది డివిజనల్లో వైసీపీ టికెట్ నిరాకరించడంతో వేరుగా నిలబడి పోటీ చేస్తున్న వారి వల్ల అధికార పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

అయితే అధికార పార్టీ మాత్రం వారిని అసలు ఖాతరు చేయడంలేదు. వారు ఏమీ చేయలేరని  ధీమాతో ఉంది . కానీ వారికే జనంలో బ్రహ్మరధం పడుతున్నారుట. ఈ పరిణామాలు అసలు  వైసీపీ అభ్యర్ధులకు దడ పుట్టిస్తున్నాయి. వీరి విషయంలో హై కమాండ్ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్ల ఈ  పిట్ట పోరులో టీడీపీకి లాభం జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా జనాల్లో పేరు ఉండి, చాలా కాలంగా పార్టీలో పనిచేస్తున్న వారిని వైసీపీ గుర్తించకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తునని కార్యకర్తలు కూడా అంటున్నారు.  చూడాలి మరి ఏం జరుగుతుందో.




పుర పోరు: విజ‌య‌వాడ వైసీపీ మేయ‌ర్ విష‌యంలో జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్ ?

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?

గాంధీ కుటుంబం నార్త్ నుంచి సౌత్‌కు షిఫ్ట్.. క‌న్యాకుమారి నుంచి బ‌రిలో ప్రియాంకా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>