ViralMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/haridhaspoore5eaa30e-cecd-477a-a84c-f7c6bbcd9faf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/haridhaspoore5eaa30e-cecd-477a-a84c-f7c6bbcd9faf-415x250-IndiaHerald.jpgచెత్తంటే అంద‌రికీ చీపే చెత్త క‌నిపిస్తే చాలు ముక్కు మూస‌కుని ప‌క్క‌నుండి వెళ్లిపోతారు. కానీ ఓ గ్రామంలో చెత్త‌ను ఉప‌యోగించి డ‌బ్బులు సంపాదిస్తున్నారు. అంతే కాకుండా వ‌చ్చిన డ‌బ్బును గ్రామాభివృకి ఉప‌యోగిస్తున్నారు. అది కూడా ఎక్క‌డో కాదు మ‌న తెలంగాణ రాష్ట్రంలోనే కావ‌డం విషేశం. చెత్త‌తో డ‌బ్బులు ఎలా సంపాదిస్తారు..ఆ డ‌బ్బుతో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం..! తెలంగాణ లోని హ‌రిదాస్ పూర్ లో చెత్త‌ను రీసైక్లింగ్ చేసి డ‌బ్బును సంపాదిస్తున్నారు. హ‌రిదాస్పూర్‌ గ్రామ ప్ర‌జ‌లు గ్రామం చిharidhaspoor;telangana;television;village;2020;lie;reddy;malla reddyకాసులు కురిపిస్తున్న చెత్త..ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ గ్రామం.!కాసులు కురిపిస్తున్న చెత్త..ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ గ్రామం.!haridhaspoor;telangana;television;village;2020;lie;reddy;malla reddySat, 06 Mar 2021 21:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలోనే కావ‌డం విషేశం. చెత్త‌తో డ‌బ్బులు ఎలా సంపాదిస్తారు..ఆ డ‌బ్బుతో గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం..! తెలంగాణ లోని హ‌రిదాస్ పూర్ లో చెత్త‌ను రీసైక్లింగ్ చేసి డ‌బ్బును సంపాదిస్తున్నారు. హ‌రిదాస్పూర్‌ గ్రామ ప్ర‌జ‌లు గ్రామం చివ‌ర‌లో త‌డి పొడి చెత్త డంపింగ్ ను వేరు వేరుగా ఏర్పాటు చేశారు. ఆ చెత్త నుండి రీసైక్లింగ్  చేయ‌గ‌లిగే వ్య‌ర్థాల‌ను వేరు చేస్తున్నారు. ప‌నికిరాని చెత్త‌ను వేరు చేసి కాల్చి వేస్తారు. అలా కాల్చివేయ‌గా వ‌చ్చిన బూడిద‌ను కూడా మ‌ళ్లీ ఉప‌యోగిస్తున్నారు. ఇక మిగిలిన త‌డి చెత్త‌తో కంపోస్ట్ ఎరువును త‌యారు చేస్తున్నారు. ఆ కంపోస్ట్ ఎరువును రైతుల‌కు పంపించి దాని ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.

అలా దాదాపు గా రూ.70 వేల వ‌ర‌కు చెత్త‌తో సంపాదిస్తున్నారు. 2020 జులై నుండి హ‌రిదాస్ పూర్ గ్రామ ప్ర‌జ‌లు చెత్త‌ను రీసైక్లింగ్ చేయ‌డం ద్వారా డ‌బ్బును సంపాదిస్తున్నారు. ఇక దీని ద్వారా ఎంతో మందికి ఉపాది కూడా ల‌భిస్తుంది. చెత్త‌ను లారీల‌లో స‌ప్లై చేయ‌డం ద్వారా డ్రైవ‌ర్ల‌కు ఆదాయం వ‌స్తుంది. ఇలా చెత్త ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టామ‌ని గ్రామ స‌ర్పంచ్ మ‌ల్లా రెడ్డి తెలిపారు. గ్రామంలో స్పీక‌ర్లు, 32 సీసీ టీవీ కెమెరాలు, ప‌బ్లిక్ అడ్ర‌స్ సిస్ట‌మ్ లు ఏర్పాటు చేశామ‌న్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా  గ్రామంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ట్రాక్ చేస్తామ‌ని అన్నారు. అంతే కాకుండా గ్రామంలో జి ప్ల‌స్ వ‌న్ పంచాయితీ భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నామ‌ని అన్నారు. ఈ భ‌వ‌నం లో మ‌హిళా సంఘాలు స‌మావేశం అవ్వ‌డానికి ప్ర‌త్యేక రూం ను ఏర్పాటు చేశామ‌ని అన్నారు. త‌మ గ్రామంలో జ‌రుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో గ్రామ‌స్థుల కృషి ఎంతో ఉంద‌న్నారు.  ‌


వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>