MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uvc361a0e5-48f1-4c41-a134-5048ff67bf28-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uvc361a0e5-48f1-4c41-a134-5048ff67bf28-415x250-IndiaHerald.jpgటీం ఇండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే.. ఫామ్ లేమి కారణంగా అయన చాల రోజుల క్రితం జట్టులో స్థానం కోల్పోగా తిరిగి జట్టులోకి రావాలని చాలా ట్రై చేశారు.. అయితే యువకులతో అయన పోటీ పడలేక జట్టుకు దూరమయ్యారు.. దాంతో ఇటీవలే అయన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తనదైన టైం లో క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు యువీ. సిక్సులు వీరుడిగా యువీ కి అభిమాన బలం కూడా బాగానే ఉంది.. uv;hazel keech;mithra;cricket;yuvraj singh;india;media;marriage;cancer;wife;instagram;internationalఅభిమానులకు షాక్.. యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ బ్రేక్..?అభిమానులకు షాక్.. యువరాజ్ సింగ్ భార్య హాజెల్ కీచ్ బ్రేక్..?uv;hazel keech;mithra;cricket;yuvraj singh;india;media;marriage;cancer;wife;instagram;internationalSat, 06 Mar 2021 11:59:00 GMTఇండియా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ప్రస్తుతం క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే.. ఫామ్ లేమి కారణంగా అయన చాల రోజుల క్రితం జట్టులో స్థానం కోల్పోగా తిరిగి జట్టులోకి రావాలని చాలా ట్రై చేశారు.. అయితే యువకులతో అయన పోటీ పడలేక జట్టుకు దూరమయ్యారు.. దాంతో ఇటీవలే అయన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. తనదైన టైం లో క్రికెట్ ప్రపంచాన్ని శాసించాడు యువీ. సిక్సులు వీరుడిగా యువీ కి అభిమాన బలం కూడా బాగానే ఉంది..

ఇక యువరాజ్ ప్రొఫెషనల్ కెరీర్ ఇలా ఉంటే పర్సనల్ లైఫ్ లో అయన నటి హేజెల్ కీచ్ ని పెళ్లి చేసుకున్నాడు. క్యాన్సర్ ని జయించి మళ్ళీ క్రికెట్ లో కి అడుగుపెట్టిన యువీ స్టోరీ తీస్తే మంచి బయోపిక్ అవుతుంది. ఇదిలా ఉంటే హాజెల్ కీచ్ ను పెళ్లి చేసుకున్నప్పటినుంచి వారి మధ్య అన్యోన్యత చాలా బాగుంది.. ఎక్కడికెళ్లినా వీరు కలిసి వెళ్లడం, సోషల్ మీడియా లో ఫోటోలు పెట్టడం వంటివి చూస్తే వారి మధ్య అనుబంధం ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు..

ఇక తాజాగా  హజెల్‌ కీచ్‌ కీలక నిర్ణయం తీసుకుంది.ఆమె నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఆమె కొంతకాలం పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది హజెల్ కీచ్. ఈ విషయాన్ని గురువారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు వెల్లడించింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్‌ చేయొద్దని కోరింది.పూర్తిగా ఒకరిపై ఒకరం ఆధారపడటం అలవాటైన మనకు ఒంటరిగా ఎలా బతికేవాళ్లమో గుర్తుకురావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి బ్రేక్స్‌ తీసుకోవాల్సిందేనని హజెల్‌ కీచ్‌ తెలిపింది. త్వరలోనే నేను, నా మొబైల్ బ్రేక్‌ తీసుకుంటున్నాం అంటూ పోస్ట్ చేసింది."ఈ విషయం మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుందని నాకు తెలుసు, కానీ తప్పదు..! సోషల్‌ మీడియాకు నేను వీడ్కోలు పలుకుతున్నాను. తిరిగి సోషల్‌ మీడియాలోకి వస్తాను, కానీ ఇప్పట్లో రాలేనని తెలిపింది. స్నేహితులు, బంధుమిత్రులెవరూ కూడా తనకు మెసేజ్‌ చేయొద్దు" అని హజెల్‌ కీచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కోరింది.


బాలయ్య చిన్న మనవడి అక్షరాభ్యాసం.. టెన్షన్ లో ఫ్యాన్స్ !

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>