PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/missing-priesta5a040c6-2ae6-443e-bf45-ed1c28170b96-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/missing-priesta5a040c6-2ae6-443e-bf45-ed1c28170b96-415x250-IndiaHerald.jpgపెళ్లి అనేది అమ్మాయి, అబ్బాయి జీవితాలకు ఓ అరుదైన ఘట్టం. పెళ్లితో వారి జీవితం సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇరాక్ పెళ్లంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఇళ్లంతా బంధువులు, చుట్టాల హడావుడి..ఇక ప్రేమ పెళ్లిలో మాత్రం ఇవేవీ కనిపించవు.. కొందరు లవర్స్‌ సంతకాల పెళ్లి చేసుకుంటే.. మరికొందరు ప్రేమికులు గుడిలోనో, ఆర్యసమాజ్ ‌లోనో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోతారు.missing priest;jeevitha rajaseskhar;mithra;prema;ravi anchor;tiru;iraq;smart phone;marriage;temple;love;girl;murder.;nayakతాళి కట్టు శుభవేళ.. పురోహితుడు మిస్సింగ్.. చివరకి ఏం చేశారంటే..!?తాళి కట్టు శుభవేళ.. పురోహితుడు మిస్సింగ్.. చివరకి ఏం చేశారంటే..!?missing priest;jeevitha rajaseskhar;mithra;prema;ravi anchor;tiru;iraq;smart phone;marriage;temple;love;girl;murder.;nayakSat, 06 Mar 2021 10:00:00 GMTపెళ్లి అనేది అమ్మాయి, అబ్బాయి జీవితాలకు ఓ అరుదైన ఘట్టం. పెళ్లితో వారి జీవితం సరికొత్త మలుపు తిరుగుతుంది. ఇరాక్ పెళ్లంటే వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, ఇళ్లంతా బంధువులు, చుట్టాల హడావుడి..ఇక ప్రేమ పెళ్లిలో మాత్రం ఇవేవీ కనిపించవు..కొందరు లవర్స్‌ సంతకాల పెళ్లి చేసుకుంటే.. మరికొందరు ప్రేమికులు గుడిలోనో, ఆర్యసమాజ్ ‌లోనో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైపోతారు..అయితే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రేమ జంట పెళ్లిలాంటిది మాత్రం గతంలో ఎప్పుడూ చూసిఉండరు.

అతనొక ప్రజాప్రతినిధి పేరు రవి నాయక్ అతని పుట్టిన రోజు సందర్బంగా ఓ శుభకార్యానికి పూనుకున్నారు. ఓ ప్రేమజంటకు పెళ్లి జరిపించి చిరకాలం గుర్తుండి పోయేలా చేశారు. ఎవరైనా పుట్టినరోజు అంటే.. ఖరీదైన కానుకలు ఇస్తారు. కానీ ఇతడు మాత్రం వారిద్దరినీ ఏకం చేసి దాంపత్య జీవితం అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు మిత్రులు వీరి పెళ్లికి ఏర్పాట్లు చేశారు. అందరూ కలిసి కేసముద్రం మండలం తాళ్ళపూసపల్లిలోని ఓ గుడికి చేరుకున్నారు. పెళ్లికి కావాల్సిన మంగళ సూత్రం, పూల దండలు అన్ని సమకూర్చారు. పెళ్లికి ముహూర్తం దగ్గర పడుతుంది. అక్కడ అంతా హడావుడి తీరా ముహూర్తం దగ్గర పడే సమయానికి పెళ్లి తతంగం నడిపించే పురోహితుడినే మరచిపోయారు.

ఇక ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవాల్సి వచ్చింది. చేసేది లేక, తెలిసిన అయ్యగారి కి ఫోన్ చేసి పెళ్ళి మంత్రాలు చదవాల్సిందిగా కోరారు. ఖంగుతిన్న అయ్యగారు పోనీలే పాపమంటూ తన తంతును ప్రారంభించారు. స్మార్ట్ మొబైల్ లో వీడియోలో మంత్రాలు చదువుతుంటే..ఇక్కడ ఇలా వధువు మెడలో మూడుముళ్లు వేశాడు వరుడు. ఇదేదో బాగుందని మిత్రులు పెళ్ళి చేసుకుంటున్న జంట భలే ముచ్చట పడ్డారు. భాజాబజంత్రీలు లేకపోవడంతో గుడి గంటలే వారి పెళ్ళికి మేళతాళాలయ్యాయి. అయ్యగారి మంత్రాలకు మిత్రులంతా తోడై అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించారు. ఇంకెందుకు ఆలస్యం పనిలో పనిగా మనం కూడా ఈ నూతన జంటను ఆశీర్వదిద్దాం. మొబైల్ ఫోన్ లో ఇక రాబోయే రోజుల్లో పెళ్లిళ్లు ఈ విధంగానే జరుగుతాయేమో అనిపిస్తుంది.


పుర పోరు: విజ‌య‌వాడ వైసీపీ మేయ‌ర్ విష‌యంలో జ‌గ‌న్ మార్క్ ట్విస్ట్ ?

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>