LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/virul-grandpaea23b582-dc7d-4f36-9852-61be24b4671a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/lifestyle/taurus_taurus/virul-grandpaea23b582-dc7d-4f36-9852-61be24b4671a-415x250-IndiaHerald.jpg98 ఏళ్ల వయస్సు.. ఇంకో రెండేళ్లయితే సెంచరీ కొట్టేసే వయస్సు.. ఈ వయస్సులో చాలా మంది మంచానికే పరిమితం అవుతారు. లేకపోతే.. ఇంట్లోనే ఉంటూ.. కృష్ణారామా అంటూ కూర్చుంటారు.. కానీ.. ఉత్తరప్రదేశ్‌ రాయ్‌బరేలికి చెందిన విజయ్‌ పాల్‌ సింగ్‌ అలా కాదు.. సెంచరీకి చేరువైనా..పనే తనకు ప్రాణం అంటున్నారు. ఈ వయస్సులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న విజయ్‌ పాల్‌ సింగ్‌.. 98 ఏళ్ల వయస్సులో తన ఇంటి సమీపంలోని రోడు పక్కన ఓ తోపుడు బండి పెట్టుకుని దాని మీద ఉడికించిన శనగలు.. మొలకలు పెట్టుకుని అమ్ముతున్నారు. పోనీ.. పొట్టకోసం తిప్పలేమvirul-grandpa;soundarya;poorna;tara;korcha;district;collector;twitter;uttar pradesh;news;sakshi98 ఏళ్ల వయస్సులో తాత సంచలనం.. జిల్లా కలెక్టరే సన్మానించారు..?98 ఏళ్ల వయస్సులో తాత సంచలనం.. జిల్లా కలెక్టరే సన్మానించారు..?virul-grandpa;soundarya;poorna;tara;korcha;district;collector;twitter;uttar pradesh;news;sakshiSat, 06 Mar 2021 08:00:00 GMT

పోనీ.. పొట్టకోసం తిప్పలేమో అనుకుంటున్నారేమో.. అదేమీ కాదు.. ఆయనది చాలా పెద్ద పెద్ద కుటుంబం.. అసలు ఇలా పని చేయడం తన ఇంట్లో వారికి ఇష్టం లేదట. ఈ విషయం కూడా తానే చెప్పాడు. కానీ ఊరికే ఖాళీగా కూర్చోవడం తనకు నచ్చదట. అందుకే ఈ పని చేస్తున్నాను అని చెబుతున్నాడీ  విజయ్‌ పాల్‌ సింగ్‌ తాత. ఈ తాత శ్రమైక జీవన సౌందర్యం చూసి ముచ్చటపడిన  అలోక్‌ పాండే అనే వ్యక్తి  తాత వీడియోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసారు. ఇక ఇలాంటి వీడియో దొరికితే వైరల్ కాకుండా ఉంటుందా.. తెగ వైరలయ్యింది.


ఆ వీడియో అలా అలా గ్రూపుల్లో చక్కర్లు కొడుతూ రాయ్‌బరేలి జిల్లా మేజిస్ట్రేట్ వైభవ్‌ శ్రీవాస్తవ కంట్లో పడింది. ఆయన బోలెడు ఆశ్చర్యపోయి. ఆ తాతను తన కార్యాలయానికి ఆహ్వానించి స్వయంగా సన్మానించారు. 11,000 రూపాయల నగదును అందజేసి.. శాలువా కప్పి సన్మానం చేసి చేశారు. ప్రభుత్వ పథకం కింద వృద్ధుడికి ఇల్లు మంజూరు చేశారు.


విజయ్‌ పాల్‌ సింగ్‌ తాత గురించి యూపీ సీఎం కూడా మెచ్చుకున్నారట. ఆయన మా అందరికి స్ఫూర్తి అంటున్నారు కలెక్టర్. అందుకే అతడికి రేషన్ కార్డు, మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు ఇచ్చామన్నారు. ఆయనకు ప్రభుత్వం తరఫున ఇంకా ఏమైనా కావాలంటే వాటిని కూడా సమకూరుస్తామన్నారు. మొత్తానికి ఈ తాత చాలా గ్రేట్‌.. మీరు ఒప్పుకుంటారు కదా.

" style="height: 370px;">



కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగితే ఓకేనా.. నిర్మలమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>