PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asad-jagan99c31bb1-0cc2-4291-afe4-bc0a7560d89b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/asad-jagan99c31bb1-0cc2-4291-afe4-bc0a7560d89b-415x250-IndiaHerald.jpgఅసద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తన సమావేశానికి సీఎం జగన్‌ అనుమతి ఇవ్వలేదని ఎంఐఎం ఎంపీ ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బేకార్ అని అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు. asad jagan;cbn;hyderabad;bharatiya janata party;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;mp;district;telugu;assembly;mla;sugar;mim party;ycp;hindus;reddy;partyజగన్ ను టార్గెట్ చేసిన అసద్జగన్ ను టార్గెట్ చేసిన అసద్asad jagan;cbn;hyderabad;bharatiya janata party;india;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;2019;mp;district;telugu;assembly;mla;sugar;mim party;ycp;hindus;reddy;partySat, 06 Mar 2021 21:14:03 GMTఆంధ్రప్రదేశ్ లో  మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతుదారుల తరఫున ప్రచారం చేస్తున్నారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. కర్నూలు జిల్లా అదోనిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అసద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి సర్కార్, వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. తన సమావేశానికి సీఎం జగన్‌ అనుమతి ఇవ్వలేదని ఎంఐఎం ఎంపీ ఆరోపించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి బేకార్ అని అసదుద్దీన్‌ ఎద్దేవా చేశారు.జగన్ మైనార్టీలను ఓటు రూపంలో వాడుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను సీఎం జగన్‌రెడ్డి గాలికి వదిలేశారని అసదుద్దీన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  ఏపీలో హిందుత్వవాదం వేళ్లూనుకుంటోందని అసద్ చెప్పారు. హిందుత్వవాద బీజేపీని నిలువరించకపోతే రాబోయే రోజుల్లో జగన్ ప్రభుత్వానికి కష్టాలు తప్పవని అభిప్రాయపడ్డారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడులు వెనుక ఉన్నది హిందుత్వవాదులేనని ఒవైసీ ఆరోపించారు.ఏపీలో సైలెంట్ గా దూసుకెళుతున్న బీజేపీ... భవిష్యత్తులో చంద్రబాబును ఇంటికే పరిమితం చేయాలని ప్రణాళికలు రచిస్తోందని తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లిగీ జమాత్ కారణమని, ముస్లింలే కారకులని ప్రచారం చేశారని మండిపడ్డారు. కరోనా భారత్ లోనే కాదని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని వెల్లడించారు. డయాబెటిస్, బీపీ, హృదయ సంబంధ వ్యాధులు కిడ్నీ వ్యాధులు కూడా ముస్లింలలోనే ఉన్నాయా?... మిగతావారిలో లేవా? అంటూ ప్రశ్నించారు.

జగన్ పాలన, వైసీపీ నేతల తీరుపై కర్నూల్ లో అసద్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇస్తూ వస్తోంది ఎంఐఎం పార్టీ. సీఎం జగన్ కు ఓపెన్ గానే సపోర్ట్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగన్ మద్దతుగా ప్రకటనలు చేశారు అసద్. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.మైనార్టీలంతా జగన్ పార్టీకి మద్దతుగా ఉండాలని పిలుపిచ్చారు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.





వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>