PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఆలస్యం పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నేటివరకు అతికొద్దిమంది ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే పెన్షన్స్ అందాయి అని అన్నారు. మార్చి 5వ తేదీ వచ్చినా ఫిబ్రవరి నెల పింఛన్లjagan,ycp,ap;tiru;jagan;andhra pradesh;sbi;2020;september;february;customer;marchజగన్ పై ఉద్యోగుల తిరుగుబాటు... ఇది అన్యాయంజగన్ పై ఉద్యోగుల తిరుగుబాటు... ఇది అన్యాయంjagan,ycp,ap;tiru;jagan;andhra pradesh;sbi;2020;september;february;customer;marchSat, 06 Mar 2021 11:01:06 GMTఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్రాధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఆలస్యం పై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. నేటివరకు అతికొద్దిమంది ఎస్బీఐ ఖాతాదారులకు మాత్రమే పెన్షన్స్ అందాయి అని అన్నారు.

మార్చి 5వ తేదీ వచ్చినా ఫిబ్రవరి నెల పింఛన్లు నేటికీ అందకపోవడం ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది అని విమర్శించారు. పదవీ విరమణ అనంతరం ప్రయోజనాలైన జీపీఎఫ్, గ్రాట్యూటీ, కమ్యుటేషన్, ఎర్డ్న్ లీవ్, మెడికల్ రీయింబర్స్ మెంట్ వంటి ప్రయోజనాలు నేటికీ అందలేదు అని అన్నారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం అని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు  సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకొన్నదని జీపీఎఫ్ లోన్ అడ్వాన్స్ లు, ప్రయోజనాలు కూడా నెలల తరబడి మంజూరు చేయడంలేదు అని ఆరోపించారు.

ఆర్థిక శాఖలో 2020 సెప్టెంబర్ 30వతేదీ నుంచి నేటివరకు సుమారు రూ.2 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి అని పేర్కొన్నారు. ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఆందోళనలకు గురవుతున్నారు అని ఆయన అన్నారు. సీఎస్ తక్షణమే జోక్యం చేసుకుని నేటివరకు బకాయిపడిన పెండింగ్ బిల్లుల మొత్తాన్ని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేసారు. బకాయిలను ప్రభుత్వ విధానాల మేరకు వారు జారీ చేసిన జీవో 100 మేరకు 4 1/2 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలి అని డిమాండ్ చేసారు. ఉద్యోగుల జీతభత్యాలకు ఈఎస్ఆర్ లో సర్వీస్ వివరాల నమోదుకు ముడిపెడుతూ జీతభత్యాలను ఆలస్యం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. గత నెల 18వ తేదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన ఉద్యోగ సంఘాల చర్చలలో ఈ విషయాన్ని ప్రస్తావించామన్నారు. కానీ నేటికీ ఈ అంశం ప్రభుత్వం నుండి స్పందన లేదు అన్నారు.


కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>