Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabh-pantc34b092d-09f0-4728-804f-2b9224fd25ae-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/rishabh-pantc34b092d-09f0-4728-804f-2b9224fd25ae-415x250-IndiaHerald.jpgటీమిండియా వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మామూలోడు కాదంటూ ఆస్ట్రేలియా మాజీ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గిల్ క్రిస్ట్ అన్నాడు. పంత్ ఇంతలా బాదగలడని అనుకోలేదని, కానీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అతడు కొట్టిన సెంచరీ అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో..rishabh pant;rani;sundar;varsha;audi;india;australia;media;bcci;rishabh pant;96;parugu‘పంత్ మామూలోడు కాదు.. ఇలా బాదుతాడని అనుకోలేదు’‘పంత్ మామూలోడు కాదు.. ఇలా బాదుతాడని అనుకోలేదు’rishabh pant;rani;sundar;varsha;audi;india;australia;media;bcci;rishabh pant;96;paruguSat, 06 Mar 2021 13:19:48 GMTఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ మామూలోడు కాదంటూ ఆస్ట్రేలియా మాజీ కీపర్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గిల్ క్రిస్ట్ అన్నాడు. పంత్ ఇంతలా బాదగలడని అనుకోలేదని, కానీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అతడు కొట్టిన సెంచరీ అద్భుతమని ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒత్తిడిలోనూ పంత్‌ సూపర్ సెంచరీ బాదాడు. కష్టాల్లో ఉన్న టీమిండియాను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లి పటిష్ఠ స్థితిలో నిలిపాడు. వాషింగ్టన్‌ సుందర్‌(96)తో కలిసి పంత్‌(101) ఏడో వికెట్‌కు ఏకంగా సెంచరీ పార్ట్‌నర్షిప్ నెలకొల్పాడు.

ఈ క్రమంలోనే ఆసీస్ దిగ్గజం గిల్‌క్రిస్ట్‌తో పాటు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, ఇంగ్లాండ్‌ మాజీ సారథులు మైఖేల్‌ వాన్‌, పీటర్సన్‌తో పొగడ్తలతో ముంచెత్తారు. కెరీర్లో తొలి సెంచరీ అయినా.. ఇది పంత్ కెరీర్లోనే నిలుస్తుందని అభినందించారు. 'నువ్వెన్ని పరుగులు చేశావన్నది మాత్రమే కాదు. ఎప్పుడు చేశావన్నదీ ముఖ్యమే. తొలి ఇన్నింగ్స్‌ లాగే నువ్వు రెండో ఇన్నింగ్స్‌లోనూ సమన్వయంతో ఆడి జట్టుకు అవసరమైన సమయంలో రాణించావు. అందుకే నువ్వు నిజమైన మ్యాచ్‌ విన్నర్‌వి. నిన్ను గమనిస్తూనే ఉంటా పంత్‌' అని గిల్ క్రిస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్‌ చేశాడు.

ఇక ఈ ఇన్నింగ్స్‌తో పంత్‌ భారత్‌లో తొలి టెస్టు శతకం సాధించడమే కాకుండా గిల్‌క్రిస్ట్‌ నెలకొల్పిన ఓ రికార్డునూ అదుకున్నాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, భారత్‌లో టెస్టు శతకాలు సాధించిన రెండో కీపర్‌గా పంత్‌ నిలిచాడు. ఇంతకుముందు గిల్‌క్రిస్ట్‌ మాత్రమే మూడు ఉప ఖండాల్లో మూడంకెల స్కోర్లు చేశాడు. దీంతో ఈ యువబ్యాట్స్‌మన్‌ను అభిమానులు గిల్‌క్రిస్ట్‌తో పోల్చి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గిల్ క్రిస్ట్ కూడా పంత్‌ను ప్రశంసించాడు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం టీమిండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా పూర్తి స్థాయిలో పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో పంత్, సుందర్ పోరాటంతో 160 పరుగులకు పైగా ఆధిక్యం సాధించింది. ఇక టీమిండియా బౌలర్లు కూడా రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను భారీ దెబ్బ కొట్టారు. ఏకంగా 41 పరుగులకే 4 వికెట్ల తీసి నడ్డి విరిచాడు. ఇండియా గెలుపు కు ఇక 6 వికెట్ల సాధిస్తే చాలు.


తొలి ఇన్నింగ్స్ లో 365 ప‌రుగుల‌కు భార‌త్ ఆలౌట్‌

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>