MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/young-talented-hero-in-ntr307aea1b28-e67e-4467-a04a-c8438264461b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/young-talented-hero-in-ntr307aea1b28-e67e-4467-a04a-c8438264461b-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని థమన్ అందించిన సాంగ్స్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఇక దాని తరువాత త్వరలో ఎన్టీఆర్ తో ఒక భారీ మూవీ చేయనున్నారు త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సామెత సినిమా సూపర్ హిట్ కొట్టి వీరి కాంబో కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో తదుపరిtrivikram srinivas;jr ntr;ntr;pooja hegde;allu arjun;kalyan;kalyan ram;ram pothineni;srinivas;thaman s;trivikram srinivas;india;tollywood;rrr movie;cinema;huzur nagar;heroine;success;film nagar;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;vemuri radhakrishna;ntr artsజెండా పాతడానికి ఇదే రైట్ టైం అని భావిస్తున్న త్రివిక్రమ్ ... వర్కౌట్ అవుతుందా .....??జెండా పాతడానికి ఇదే రైట్ టైం అని భావిస్తున్న త్రివిక్రమ్ ... వర్కౌట్ అవుతుందా .....??trivikram srinivas;jr ntr;ntr;pooja hegde;allu arjun;kalyan;kalyan ram;ram pothineni;srinivas;thaman s;trivikram srinivas;india;tollywood;rrr movie;cinema;huzur nagar;heroine;success;film nagar;nandamuri taraka rama rao;arjun 1;ala vaikunthapurramloo;vemuri radhakrishna;ntr artsSat, 06 Mar 2021 18:00:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా తో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలోని థమన్ అందించిన సాంగ్స్ కి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఇక దాని తరువాత త్వరలో ఎన్టీఆర్ తో ఒక భారీ మూవీ చేయనున్నారు త్రివిక్రమ్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన అరవింద సామెత సినిమా సూపర్ హిట్ కొట్టి వీరి కాంబో కి మంచి పేరు తెచ్చిపెట్టడంతో తదుపరి ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా విషయమై మరింత శ్రద్ధ పెడుతున్నారట త్రివిక్రమ్.

హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ ఖర్చుతో నందమూరి కళ్యాణ్ రామ్, సూర్యదేవర రాధాకృష్ణ కలిసి నిర్మించనున్న ఈ సినిమాకి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉండగా దీనిని మంచి పొలిటికల్ జానర్ మూవీ గా పలు కమర్షియల్ హంగులు కలగలిపి త్రివిక్రమ్ తీయనున్నారని అంటున్నారు. ఎస్ థమన్ స్వరాలు సమకూర్చనున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక వార్త పలు ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈ సినిమాని త్రివిక్రమ్ భారీ పాన్ ఇండియా మూవీగా తీయనున్నారని, ఈ సబ్జెక్ట్ కి తెలుగు తో పాటు పలు ఇతర భారతీయ బాషలకు కూడా బాగా సెట్ అవుతుందని, అందుకే దీని స్క్రిప్ట్ ని తన బృందంతో కలిసి కొద్దిరోజుల నుండి మరింతగా ఆయన సాన పడుతున్నారని అంటున్నారు.

మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెల్సిందే. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఆయన కు తప్పకుండా పాన్ ఇండియా స్టార్ గా మరింత గొప్ప ఇమేజ్ వస్తుందని, అది తన సినిమాకు కొంత ఉపయోగపడుతుందని త్రివిక్రమ్ యోచిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా దీని ప్రకారం పక్కాగా తాను పాన్ ఇండియా సినిమా తీసి దర్శకుడిగా మరింత మంచి పేరు దక్కించుకోవడానికి జెండా పాతేందుకు త్రివిక్రమ్ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు మాత్రం అధికారికంగా వెల్లడి కావలసి ఉంది....!!


1870 మంది రౌడిషిటర్స్... బెజవాడ సీపీ కీలక వ్యాఖ్యలు

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>