PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/devineni-avinasa-uppar-hand-in-vijayawada3eeec7b0-6241-4689-8484-4fb14d44f63b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/devineni-avinasa-uppar-hand-in-vijayawada3eeec7b0-6241-4689-8484-4fb14d44f63b-415x250-IndiaHerald.jpgపోరాటాలకు పురిటిగడ్డ అయిన ప్రాంతం అది. రాజకీయంగా, వాణిజ్యపరంగా, విద్యాపరంగా... ఇలా అన్నిరంగాల్లోను ఆధిపత్యం కోసం నిరంతరం ఒకరితో ఒకరు పోరు జరిగే ప్రాంతం అది.. తాజాగా ఇప్పుడు జరుగుతున్న పురపాలక సంఘాల ఎన్నికలతో ఆ పోరు రసవత్తరంగా మారింది. ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించడానికి, రాజకీయంగా పట్టు పెంచుకోవడానికి ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మలచుకున్నారు. అయితే ఎవరిపై ఎవరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు? ఎవరిపై ఎవరు పైచేయి సాధిస్తున్నారు.. అనేది ఇప్పుడు చూద్దాం!tdp, ycp, breaking, ap, latest, vja;view;amala akkineni;vijayawada;chanakya-movie-2019;devineni avinash;2019;telugu;chanakya;mla;ycpపురపోరు: దేవినేని ముందు గద్దే అస్త్ర సన్యాసంపురపోరు: దేవినేని ముందు గద్దే అస్త్ర సన్యాసంtdp, ycp, breaking, ap, latest, vja;view;amala akkineni;vijayawada;chanakya-movie-2019;devineni avinash;2019;telugu;chanakya;mla;ycpSat, 06 Mar 2021 07:32:23 GMT
విజయవాడ.. ఒకప్పుడు బెజవాడ.. పేరు మారినా రాజకీయ ఆధిపత్య పోరు మాత్రం  మారలేదు. వ్యక్తుల మధ్య ఆధిపత్యం కోసం జరిగే యుద్ధం ఆగలేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని అవినాష్ మధ్య రాజకీయ రణరంగం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే గద్దేపై దేవినేని ఆధిపత్యం చెలాయిస్తున్నారని చెప్పవచ్చు. అవినాష్ రాజకీయ చాణక్యం ముందు తెలుగుదేశం పార్టీకానీ, గద్దే రామ్మోహన్ కానీ నిలబడలేకపోయారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారి బలాబలాలు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే తీరు, గెలిస్తే ఏం చేస్తామో ప్రజల్ని ఒప్పించడంలాంటి విషయాల్లో అవినాష్ ముందంజలో ఉన్నారు. దీనికోసం ఆయన ఒక ప్రత్యేక ప్రణాళిక రచించుకొని వాటిని వైసీపీ తరఫున పోటీచేసే అభ్యర్థులద్వారా అమలుచేయిస్తున్నారు.


ల‌బ్బీపేట‌లో ముస్లింల కోసం షాదీఖానా నిర్మిస్తానంటూ ఇచ్చిన హామీని వ‌దిలేసిన గ‌ద్దే వైఖ‌రినే దేవినేని ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటున్నారు. 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ షాదీఖానాను నిర్మించ‌లేక‌పోయారంటూ తాను ముఖ్య‌మంత్రితో మాట్లాడి నిర్మింప‌చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అందుకు త‌గ్గ‌ట్లుగా ఆ డివిజ‌న్‌లో అభ్య‌ర్థిని గెలిపించాల‌ని కోరారు. 15వ డివిజ‌న్‌ను మోడ‌ల్ డివిజ‌న్‌గా రూపొందిస్తాన‌ని రామ్మోహ‌న్ ఇచ్చిన హామీ కూడా నెర‌వేర‌లేదు. అధికారంలో ఉన్న‌ప్పుడే అభివృద్ధి చేయ‌లేదంటే ఇప్పుడేం చేస్తారంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నించుకునేలా దేవినేని వ్యూహాన్ని ర‌చించారు. ఇప్పుడు అది ఆయా డివిజ‌న్ల‌లో వైర‌ల్‌గా మారింది. మోడ‌ల్ డివిజ‌న్ రూపొందాలంటే వైసీపీ వ‌ల్లే సాధ్య‌ప‌డుతుంద‌నేది న‌గ‌ర ప్ర‌జ‌ల్లోకి అవినాష్ స్ప‌ష్టంగా తీసుకువెళ్ల‌గ‌లిగారు. ఏదేమైన‌ప్ప‌టికీ విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ను వైసీపీ ప‌రం చేయ‌డం కోసం దేవినేని అవినాష్ వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను సిద్ధం చేయ‌గ‌లిగారు.






పురపోరు: టీడీపీ కోటలో పాగా కోసం....

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>