Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi22b96e99-9a19-4c87-a82b-3a95f8d35e67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-pallavi22b96e99-9a19-4c87-a82b-3a95f8d35e67-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా చాలా క్రేజ్ తెచ్చుకుంది సాయి పల్లవి. ఈమె కోసమే కథలు రాసే దర్శకులు కూడా తెలుగులో ఉన్నారు. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలsai pallavi;koti;nani;cinema;telugu;interview;tamilnadu;doctor;heroine;makeup;sai pallavi;fidaaతన కులం గురించి చెప్పేసిన సాయి పల్లవి...?తన కులం గురించి చెప్పేసిన సాయి పల్లవి...?sai pallavi;koti;nani;cinema;telugu;interview;tamilnadu;doctor;heroine;makeup;sai pallavi;fidaaFri, 05 Mar 2021 23:00:00 GMTఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ చిత్రం తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో కూడా సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి. అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా అమ్మడు క్రేజ్ మాత్రం అలాగే ఉంది.


అప్పుడెప్పుడో ఒక డ్యాన్స్ షో, తర్వాత విదేశాల్లో డాక్టర్ కోర్సు మళ్లీ సడన్ గా సినిమాల్లో మెరుపులా మెరిసింది. అందరి హృదయాలు కొల్లగొట్టింది.అబ్బాయిలకు కలల దేవతగా, అమ్మాయిలకు ఆత్మవిశ్వాసంగా మారింది. ముఖంపైన ఒక మొటిమ వస్తేనే నానా హైరానా పడే అమ్మాయిలకు తనొక రోల్ మోడల్ అంతే. ముఖం పై మచ్చల్ని కన్సీలర్ తో కవర్ చేసి, మేకప్ అద్దే అందాల మధ్య , ముఖం నిండా ముటిమలతో, ఎలాంటి మేకప్ లేకుండా నటించి అసలైన హీరోయిన్ కి అర్ధం చెప్పింది.
 ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చెప్పిన విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.


“ఒక వేళ నేను నటిని కాకుంటే ఎంబీబీఎస్‌ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదానిని. మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదు.నా గురించి తెలియని వాళ్లకి ఇది కొత్త విషయం” అంటూ  తెలిపింది. ఇందులో విషయం ఏముంది. ఎందుకు లేదు మన దేశంలో, మన సమాజంలో కులానికున్నంత ప్రాముఖ్యత మరొక విషయానికి ఉండదు.సాయిపల్లవి విషయంలోనూ అదే జరిగింది. ఎస్ సాయిపల్లవి గిరిజన అమ్మాయా. సాయిపల్లవి ఎస్ .టి ఆ అంటూ చాలా మంది ముక్కున వేలేసుకున్నారు.


నిజానికి ఎక్కడైనా క్యాస్ట్ గురించి ప్రస్తావన రాగానే ఒక రకమైన ఇబ్బందికి గురౌతుంటారు. చాలామంది తమ కులాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు , కాని సాయిపల్లవి ధైర్యంగా చెప్పింది.తను సాయిపల్లవి కాబట్టే చెప్పింది. తనకు బాగా ఆటీట్యూడ్ ఎక్కడో విన్నాను ఈ మాట, నానితో ఎమ్ సి ఎ షూటింగ్ తర్వాత అనుకుంటా ఎక్కువగా వార్తల్లో ఇలాగే నానింది సాయిపల్లవి పేరు.. సాయిపల్లవి లాంటి అమ్మాయిలకు ఆటిట్యూడే అందం.అయినా అమ్మాయిలు తమకు విలువలకు తగినట్టుగా బతికితే దానికి పెట్టే పేరు ఆటిట్యూడ్, పొగరు. తనొక అధ్బుతం అంతే.. సినిమాల్లో ఛాన్సులు లేకపోతే వెళ్లిపోయి తన డాక్టర్ వృత్తి ప్రాక్టీస్ చేసుకుంటుంది అంతే తప్ప ఇక్కడే ప్రాకులాడుతూ కూర్చోదు. తనొక సినిమా చేయాలంటే ముందు అందులో తన పాత్ర తనకి నచ్చాలి.


పాత్ర ప్రాధాన్యత, నో ఎక్స్ పోజింగ్ ఇవి సాయిపల్లవి నియమాలు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి వీటిని అధిగమించింది లేదు, ఆ నియమాల్ని దాటమని మీరు కోట్లు ఆఫర్ చేసినా నో అనేస్తుంది.. ఒక చిన్న ఉదాహరణ ఒక ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ కోసం వాళ్లు ఆఫర్ చేసిన  కోటి రూపాయలను చాలా సింపుల్ గా రిజెక్ట్ చేసింది.ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే సాయిపల్లవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అబ్బా చెప్పుకోవాలనిపిస్తూనే ఉంటుంది.


వధూవరుల కిడ్నాప్ కు తల్లిదండ్రుల స్కెచ్..షాక్ ఇచ్చిన పోలీసులు

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>