PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-ap-jagan-breakingf3543267-87aa-4a12-9391-048d5867514d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ycp-ap-jagan-breakingf3543267-87aa-4a12-9391-048d5867514d-415x250-IndiaHerald.jpgరాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో 7 నుంచి 12వ తరగతి వ‌ర‌కు చ‌దువుకుంటున్న విద్యార్థినుల‌కు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాలయంలో స‌మీక్షించారు. దీనికి విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.ycp, ap, jagan, breaking;jr ntr;vidya;chief minister;march;lie;reddyవిద్యార్థినుల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్‌కిన్స్విద్యార్థినుల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్‌కిన్స్ycp, ap, jagan, breaking;jr ntr;vidya;chief minister;march;lie;reddyFri, 05 Mar 2021 21:02:00 GMTముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో 7 నుంచి 12వ తరగతి వ‌ర‌కు చ‌దువుకుంటున్న విద్యార్థినుల‌కు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీపై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న క్యాంపు కార్యాలయంలో స‌మీక్షించారు. దీనికి విద్య, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు హాజరయ్యారు.

ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7 నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చదువుకుంటున్న ద్యార్థినులకు బ్రాండెడ్ కంపెనీలకు చెందిన న్యాప్‌కిన్స్ ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాలు జారీచేశారు. బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలని, మార్చి 8 అంత‌ర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఈ ఉచిత శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ పథకం ప్రారంభించ‌నున్నారు. ఏప్రిల్ 15వ తేదీలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల‌ని, మంచి కంపెనీలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, గురుకుల పాఠశాలల విద్యార్థినిలకు శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచేలా చూడాల‌న్నారు.

జులై 1 నుంచి ప్రతి నెలా ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్స్ పంపిణీ కార్యక్రమం జ‌ర‌గ‌నుంది.  నెలకి 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్‌కిన్స్ ను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సుమారు రూ. 41.4 కోట్ల ఖర్చు చేయనుంది.  గ్రామీణ ప్రాంతాల్లో చేయూత కిరాణా స్టోర్ల ద్వారా తక్కువ ధరకే బ్రాండెడ్ కంపెనీల శానిటరీ న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచ‌నున్నారు. దీని కోసం న్యాప్‌కిన్స్ తయారీలో అత్యుత్తమ కంపెనీలతో మెప్మా, సెర్ప్ ఎంవోయూ ఏకం కానున్నట్లు అధికారులు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. తీసుకుంటున్న చ‌ర్య‌లు, చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాల గురించి స‌మ‌గ్ర‌మైన నివేదిక రూపొందించిన‌ట్లు చెప్పారు. విద్యార్థినిలకు పోటీపరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందించాలని, ఇందుకు ల్యాప్‌టాప్‌లను ఉప‌యోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.





బ్రేకింగ్: వాలంటీర్లకు కలెక్టర్ షాక్

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>