PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-mayor-vijaylaxmidb17d794-6c88-46ed-96e1-6110a22a8633-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hyderabad-mayor-vijaylaxmidb17d794-6c88-46ed-96e1-6110a22a8633-415x250-IndiaHerald.jpgజీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన వారికి మేయర్‌ టీఆర్‌ఎస్‌ కరపత్రాలు పంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తన ఛాంబర్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్దమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.hyderabad mayor vijaylaxmi;amala akkineni;ram gopal varma;prema;vijayalakshmi;hyderabad;telangana;ram madhav;love;international;research and analysis wingచిక్కుల్లో హైదరాబాద్ మేయర్!చిక్కుల్లో హైదరాబాద్ మేయర్!hyderabad mayor vijaylaxmi;amala akkineni;ram gopal varma;prema;vijayalakshmi;hyderabad;telangana;ram madhav;love;international;research and analysis wingFri, 05 Mar 2021 09:01:34 GMTహైదరాబాద్ కొత్త మేయర్ గద్వా ల విజయలక్ష్మి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మేయర్ గా గెలిచిన రోజులపై హైదరాబాద్ లో వర్షాలు రావొద్దని కోరుకుంటున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో విజయలక్ష్మి.. తన కామెంట్లపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన వారికి మేయర్‌ టీఆర్‌ఎస్‌ కరపత్రాలు పంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తన ఛాంబర్‌లో టీఆర్‌ఎస్‌ తరఫున ప్రచారం చేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్దమని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇటీవల మేయర్‌ను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంలో ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలంటూ వారికి మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కరపత్రాలు పంచారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో మేయర్‌పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మిపై సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మేయర్‌ ఓ చేత్తో కుక్కకు.. మరో చేత్తో తాను తింటున్నట్లు వైరల్‌ అయిన వీడియోపై ఆర్జీవీ స్పందిస్తూ..  ‘‘కుక్కపై మేయర్‌ ప్రేమ ఎంతో ఉన్నతంగా ఉంది.. కుడి చేత్తో కుక్కకు తినిపిస్తూ ఎడమ చేత్తో తాను తింటున్నారు. ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేయాలి. ఆమె కుక్కపై చూపుతున్న ప్రేమకు దీటుగా ప్రజలను ప్రేమించగలరా? కుక్కను ఆమె అంతగా ప్రేమించడాన్ని చూస్తుంటే మరో జన్మలో తాను కుక్కగా పుట్టాలని కోరుకుంటున్నాను.ఇంతగా ఆమె తన కుటుంబాన్ని, తన పార్టీని, తెలంగాణ ప్రజలను కూడా ప్రేమిస్తారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవంగా కుక్కను చూసి అందరూ ఈర్ష్య చెంది ఉంటారు’’ అని ఆర్జీవీ కామెంట్ చేశారు. ఆర్జీవీ కామెంట్లు  చర్చనీయాంశంగా మారాయి.




పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...

విశాఖ ఉక్కు ఉద్య‌మం ఊపందుకున్న‌ట్లేగా...పార్టీలు ఏం చేస్తున్నాయంటే...?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిలకు అంతర్జాలంలో మొత్తంగా ట్రోల్స్ - నేటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేఖత

ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. దాని పేరు పి-1

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>