MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pragyaed134dbb-5f66-4577-9d01-df6ec36e8f6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pragyaed134dbb-5f66-4577-9d01-df6ec36e8f6a-415x250-IndiaHerald.jpgబాలక్రిష్ణ సినిమా అంటేనే పక్కా మాస్. యాక్షన్ తో సహా నవరసాలు మేళవించి ఉంటాయి. అందులో బాలయ్యకు మాత్రమే స్కోప్ ఉంటుంది. హీరోయిన్ సహా మిగిలిన వారికి పెద్దగా అవకాశం ఉండదు. అయితే బాలయ్య కొన్ని సినిమాల్లో మాత్రం హీరోయిన్ కి కూడా ప్రాముఖ్యత ఇస్తారు. బాలయ్య సింహా మూవీలో హీరో పక్కన నటించిన నయనతార కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తారు. pragya;balakrishna;anandi;boyapati srinu;nayantara;pragya jaiswal;cinema;hero;heroine;butter;simha;yashasvi jaiswal;massనయనతారలా ప్రగ్యా పవర్ ఫుల్...?నయనతారలా ప్రగ్యా పవర్ ఫుల్...?pragya;balakrishna;anandi;boyapati srinu;nayantara;pragya jaiswal;cinema;hero;heroine;butter;simha;yashasvi jaiswal;massFri, 05 Mar 2021 11:00:00 GMTసినిమా అంటేనే పక్కా మాస్. యాక్షన్ తో సహా నవరసాలు  మేళవించి ఉంటాయి. అందులో బాలయ్యకు మాత్రమే స్కోప్ ఉంటుంది. హీరోయిన్ సహా మిగిలిన వారికి పెద్దగా అవకాశం ఉండదు. అయితే బాలయ్య కొన్ని సినిమాల్లో మాత్రం హీరోయిన్ కి కూడా ప్రాముఖ్యత ఇస్తారు. బాలయ్య సింహా మూవీలో హీరో పక్కన నటించిన నయనతార కూడా పవర్ ఫుల్ గా కనిపిస్తారు.

అచ్చం అలాంటి రోల్ ఇపుడు బీబీ3 లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కి దక్కుతోందిట. ఈ మూవీలో కేవలం ఆడిపాడి వెళ్ళిపోయే పాత్రలో ప్రగ్యా కనిపించదుట. హీరో ఒక ఆశయం కోసం పోరాడితే అతనికి వెన్నుదన్నుగా ఉంటూ తాను కూడా శక్తివంతమైన పాత్రగా కనిపిస్తుందింట. దీంతో ప్రగ్యా మీద అందరి చూపు పడింది. ఇప్పటిదాకా ప్రగ్యా నటించిన సినిమాలు చూస్తే కేవలం గ్లామర్ డాల్ గానే ఈ అమ్మడు కనిపించింది.

ఆమెలో మంచి టాలెంట్ ఉన్నా కూడా నటనను వాడుకునే చాన్స్ మాత్రం ఏ మూవీలో రాలేదు. కానీ బోయపాటి మార్క్ మూవీలో మాత్రం నయనతార రేంజిలో ప్రగ్యాకు ఫుల్ స్కోప్ ఉన్న రోల్ దక్కిందంట. దాంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేవు అంటున్నారు. ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అయితే మాత్రం ప్రగ్యా లక్కీ గర్ల్ అవుతుంది అంటున్నారు.

ఇక ఈ మూవీలో బాలయ్య రెండవ పాత్రను ఇప్పటిదాకా ఎక్కడా రివీల్ చేయలేదు. ఆ పాత్ర ఏంటి అనంది కూడా తెలియదు అఘోరాగా బాలయ్య కనిపిస్తాడు అని చెబుతున్నా కూడా డెబ్బై ఏళ్ళకు పైబడిన ఒక వృద్ధుడిగా బాలయ్య ఈ మూవీలో గెటప్ తో అలరిస్తార‌ని ఇన్నర్ టాక్. మరి ఈ మూవీ రిలీజ్ అయితేనే తప్ప ఈ సీక్రేట్ ఏంటి అన్నది ఎవరికీ తెలియదు అంటున్నారు. మొత్తానికి బీబీ3 మీద ఇంటెరెస్టింగ్ అప్ డేట్స్ వస్తున్నాయి.




ఏపీలో మంత్రి గారి మాట ఉద్యోగులు వినరా...?

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>