PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-267-candidates-withdraw-nomination-c0f6244b-d28d-4bfc-88b8-dda7517b634b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-267-candidates-withdraw-nomination-c0f6244b-d28d-4bfc-88b8-dda7517b634b-415x250-IndiaHerald.jpgకుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నది ఒక మహా కవి. అందుకు తగ్గట్టుగానే రాజకీయాల విషయానికి వచ్చినా దగ్గర వాళ్ళ మధ్య కూడా రాజకీయాలు జరుగుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయాలు ఎంతలా తీవ్రం అయ్యాయి అంటే భార్య భర్తలు సైతం ఒకరిమీద ఒకరు పోటీ చేసే పరిస్థితికి తీసుకు వచ్చాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇలాంటి కొన్ని ఘటనలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు, బాబాయ్- అబ్బాయిల మధ్య పోటీ నెలకొంది. అనంతపురం జిల్లా వjagan nimmagadda elections;bharathi old;govi;district;mla;wife;tdp;ycp;maha;partyపురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !jagan nimmagadda elections;bharathi old;govi;district;mla;wife;tdp;ycp;maha;partyFri, 05 Mar 2021 16:00:00 GMTకుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నది ఒక మహా కవి. అందుకు తగ్గట్టుగానే రాజకీయాల విషయానికి వచ్చినా దగ్గర వాళ్ళ మధ్య కూడా రాజకీయాలు జరుగుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయాలు ఎంతలా తీవ్రం అయ్యాయి అంటే భార్య భర్తలు సైతం ఒకరిమీద ఒకరు పోటీ చేసే పరిస్థితికి తీసుకు వచ్చాయి. తాజాగా ఏపీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఇలాంటి కొన్ని ఘటనలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తోడికోడళ్లు, బాబాయ్- అబ్బాయిల మధ్య పోటీ నెలకొంది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఈసారి కొన్ని ఇలాంటి బంధుత్వాలు వెలుగులోకి వచ్చాయి. 

రాయదుర్గంలో పొరాళు వంశానికి చెందిన అన్నదమ్ములు పొరాళు గోవిందరాజులు వైసీపీ తరపున, పొరాళు ధనార్జున టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అలానే పొరాళు పురుషోత్తం టీడీపీ తరఫున 6వ వార్డులో, ఆయన భార్య గౌరి టీడీపీ తరఫున 9వ వార్డులో పోటీ చేస్తున్నారు. 5వ వార్డులో ఇద్దరు స్నేహితులు వేర్వేరు పార్టీ నుంచి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో మహబూబ్‌బాషా టీడీపీ తరఫున గెలుపొందగా ఆయనపై పోటీకి దిగిన వలి బాషా వైసీపీ నుంచి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు. అలాగే రాయదుర్గంలో పిన్ని ఒక పార్టీ నుండి కొడుకు మరో పార్టీ నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. 

మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప తమ్ముడు బండి సుధాకర్‌ భార్య, మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌ బండి భారతి టీడీపీ తరఫున 11వ వార్డులో పోటీ చేస్తుండగా బండి హులికుంటప్ప మరో సోదరుడు బండి రామమూర్తి కుమారుడు బండి అజయ్‌ కుమార్‌ 12వ వార్డులో వైసీపీ నుంచి బరిలో నిలిచారు. గతంలో తమ పిన్ని గెలుపునకు కృషి చేసిన అజయ్‌ ప్రస్తుతం మరో పార్టీ తరుపున పోటీ చేస్తూ తనను గెలిపించామని కోరుతున్నారు. అనంతరపురం కార్పోరేషన్  33వ డివిజన్‌లో దాయాదుల మధ్య పోరు నెలకొంది. వైసీపీ అభ్యర్థి సాకే చంద్రశేఖర్‌, టీడీపీ అభ్యర్థి సాకే జయప్ప మధ్య పోటీ నెలకొంది. వారిద్దరూ ఒకే వంశానికి చెందిన వారు కావడం ఆసక్తికరంగా మారింది.




ఉప్పెన 3 వారాల వసూళ్లు... డెభ్యు హీరోగా వైష్ణవ్ మరో రికార్డు...!!!

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>