PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-tata-scorpio-breaking-latest-moviesb198dc48-568f-475a-9f30-a82d46312043-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-tata-scorpio-breaking-latest-moviesb198dc48-568f-475a-9f30-a82d46312043-415x250-IndiaHerald.jpgమ‌న దేశంలో రాజ్యాంగ బద్ద‌మైన ఉన్నత పదవుల్లో ఉన్న‌వారి రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. భారత రాష్ట్రపతి వాహనం ఈ తరహాలో చాలా పటిష్టంగా తయారు చేస్తారు. అంతే కాకుండా ప్రతి దేశం కూడా త‌మ దేశ రాష్ట్ర‌ప‌తులు, ఇత‌రుల‌కు ఈ రకమైన రక్షణను కల్పించడానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఒక కీల‌క నిర్ణయం తీసుకున్నారు. jagan, tata, scorpio, breaking, latest, movies;suma;suma kanakala;jagan;andhra pradesh;vehicles;chief minister;cabinet;minister;traffic police;mahindra;mantraజ‌గ‌న్‌కు బుల్లెట్‌ప్రూఫ్ వాహ‌నంజ‌గ‌న్‌కు బుల్లెట్‌ప్రూఫ్ వాహ‌నంjagan, tata, scorpio, breaking, latest, movies;suma;suma kanakala;jagan;andhra pradesh;vehicles;chief minister;cabinet;minister;traffic police;mahindra;mantraFri, 05 Mar 2021 01:39:01 GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఒక కీల‌క నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులకు మరియు రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులకు త్వరలో కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు రానున్నాయి.

జగన్ సర్కార్ బుల్లెట్ ప్రూఫ్ వాహ‌నాల కోసం రూ. 6.75 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రస్తుతం 10 కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల కొనుగోలుకు ప్ర‌భుత్వం ఆమోద‌ముద్ర వేసింది. వీటి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6.75 కోట్లు కేటాయించింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుద‌లైంది. ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నతాధికారుల వినియోగంలోకి రానున్న మొత్తం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో ఐదు మహీంద్రా స్కార్పియోలు మిగిలిన ఐదు టాటా హెక్సా వాహనాలున్నాయి.  ఇందులో ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో కోసం 65 లక్షలరూపాయలు,  ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ టాటా హెక్సా  కోసం రూ. 70 లక్షల‌ చొప్పున ఖర్చు చేయనున్నారు.

రాష్ట్రంలో ఇప్పుడు వినియోగంలో ఉన్న వాహనాలతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రులు ఉన్న‌తాధికారుల దృష్టికి తెచ్చారు. అంతే కాకుండా పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లో తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఓ మంత్రి అనారోగ్యానికి గురైన‌ట్లు స‌మాచారం. ఇప్పటికే మంత్రుల నుంచి వ‌చ్చిన ఫిర్యాదులు, ఉన్నతాధికారుల సలహాతో ప్రస్తుతమున్న పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను భర్తీ చేయడానికి రాష్ట్రప్రభుత్వం సుముఖత చూపింది. కొత్తగా రానున్న ఈ 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి, కొంతమంది మంత్రులకు పోలీస్ శాఖలోని కొంతమంది ఉన్నతాధికారుల రక్షణకు ఉపయోగించనున్నారు.


ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>