PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishna-tdp-ycp-breaking-moviesc41cc3dd-2247-47dc-82ed-98ba805970f7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishna-tdp-ycp-breaking-moviesc41cc3dd-2247-47dc-82ed-98ba805970f7-415x250-IndiaHerald.jpgతెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ తొడగొడితే అక్కడ ఏకగ్రీవాలు ఆగిపోయాయి. తనదైన శైలిలో బాలయ్య వ్యూహాన్ని రచించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు బెడిసికొట్టాయి. హిందూపురం పురపాలక సంఘంలో ఏకగ్రీవాల కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలకు బాలయ్య సినిమా స్టైల్లోచెక్ పెట్టారు. balakrishna, tdp, ycp, breaking, movies;view;balakrishna;hari;hari music;telugu desam party;y. s. rajasekhara reddy;congress;cinema;telugu;nandamuri balakrishna;hindupuram;mla;tdp;local language;ycp;nandamuri taraka rama rao;uravakonda;partyపురపోరు: బాలయ్య తొడకొడితే ఏకగ్రీవం నిలిచిపోయిందిపురపోరు: బాలయ్య తొడకొడితే ఏకగ్రీవం నిలిచిపోయిందిbalakrishna, tdp, ycp, breaking, movies;view;balakrishna;hari;hari music;telugu desam party;y. s. rajasekhara reddy;congress;cinema;telugu;nandamuri balakrishna;hindupuram;mla;tdp;local language;ycp;nandamuri taraka rama rao;uravakonda;partyFri, 05 Mar 2021 09:20:11 GMTనందమూరి బాలకృష్ణ తొడగొడితే అక్కడ ఏకగ్రీవాలు ఆగిపోయాయి. తనదైన శైలిలో బాలయ్య వ్యూహాన్ని రచించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు బెడిసికొట్టాయి. హిందూపురం పురపాలక సంఘంలో ఏకగ్రీవాల కోసం ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ చేసిన ప్రయత్నాలకు బాలయ్య సినిమా స్టైల్లోచెక్ పెట్టారు.

పురపాలక సంఘాల్లో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరాలి.. సామ, దాన, భేద, దండోపాయాలుపయోగించైనా సరే.. ఏం చేసైనా సరే.. మనమే గెలవాలి.. మన అభ్యర్థే చైర్మన్ అవ్వాలి అంటూ ఒకే లక్ష్యంతో ఎన్నికల్లో పనిచేస్తున్న వైసీపీకి అడ్డుకట్ట పడింది. సామాజిక వర్గాన్ని ప్రేరేపించినా.. ప్రలోభాలకు గురిచేసినా.. కేసులతో భయపెట్టాలని చూసినా... తెలుగుదేశం పార్టీ  అభ్యర్థులు ఎక్కడా అదరలేదు.. బెదరలేదు. బాలయ్య అండతో నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ససేమిరా అనడంతో.. ఎమ్మెల్సీతోపాటు ఆ మున్సిపాలిటీ వైసీపీ పరిశీలకుడు, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వ్యూహరచనకు ఆదిలోనే గండి పడింది. ఈ పురపాలక సంఘంలోని 38 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులకు దీటుగా టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలోనే పాగా వేయడంతో అధికార పార్టీ ఏమీ చేయలేకపోయింది. నియోజకవర్గ పరిధిలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు గెలవకపోవడంతో.. ఆయన మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించారు.

హిందూపురం మున్సిపాలిటీపై టీడీపీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో వ్యూహరచన చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆరు రోజుల ముందే తన ప్రతినిధులైన శ్రీనివాసరావు, సురేంద్రనాథ్ను హిందూపురంలో మకాం వేయించారు. స్థానిక టీడీపీ ముఖ్య నాయకులతో, ఎన్నికల పరిశీలకులతో ఎప్పటికప్పుడు ఫోన్లో  మాట్లాడుతూ.. సూచనలు చేస్తూ వచ్చారు. షూటింగ్లో బిజీగా ఉన్నా.. అభ్యర్థులెవరూ ఉపసంహరించుకోకుండా  స్థానిక నేతలను అప్రమత్తం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ రోజు ఒక్కో అభ్యర్థి వెంట ముగ్గురు టీడీపీ నాయకులను పంపి బీ-ఫారాలు అందజేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ఎక్కడికక్కడ అప్రమత్తంగా వ్యవహరించారు. అన్ని వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచేలా చేయడంలో బాలయ్య  సఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఎన్నికలు జరిగి ఫలితాలు రావడమే తరువాయి..




పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...

విశాఖ ఉక్కు ఉద్య‌మం ఊపందుకున్న‌ట్లేగా...పార్టీలు ఏం చేస్తున్నాయంటే...?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిలకు అంతర్జాలంలో మొత్తంగా ట్రోల్స్ - నేటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేఖత

ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. దాని పేరు పి-1

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>