PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది అనే వ్యాఖ్యలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఆయన మాత్రం బీజేపీని ముందుకు నడిపించే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వ్యక్తిగత ఇమేజ్ కోసం బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ నేతలు కొంతమంది భావిస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి.bandi sanjay,bjp,ts;amala akkineni;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;v;partyబండికి సమాధానం చెప్పడం రావట్లేదా...?బండికి సమాధానం చెప్పడం రావట్లేదా...?bandi sanjay,bjp,ts;amala akkineni;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;letter;v;partyFri, 05 Mar 2021 08:10:00 GMTబీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉంది అనే వ్యాఖ్యలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాం. అయితే ఆయన మాత్రం బీజేపీని ముందుకు నడిపించే విషయంలో పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వ్యక్తిగత ఇమేజ్ కోసం బండి సంజయ్ ప్రయత్నాలు చేస్తున్నారని  బీజేపీ  నేతలు కొంతమంది భావిస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కంటే ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి.

అందుకే ఇప్పుడు  బీజేపీ  ఆయన విషయంలో కాస్త సీరియస్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీ అధిష్టానం నేతలు ఇప్పటికే పలుమార్లు మాట్లాడారు. అయితే ఇప్పుడు బండి సంజయ్ కొన్ని కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమాధానం ఇవ్వలేక పోతున్నారనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉద్యోగ నియామకాల విషయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందనే ఆరోపణలను టీఆర్ఎస్  పార్టీ ఎక్కువగా చేస్తుంది.

కనీసం వాటిని కూడా బండి సంజయ్ సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు లేవు అని వాటిని తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నామని టీఆర్ఎస్  పార్టీ నేతలు పదేపదే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నా సరే బండి సంజయ్ మాత్రం సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం సీరియస్ గానే ఉంది అని సమాచారం. ఆయనపై త్వరలోనే చర్యలు కూడా తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. బీజేపీ  రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పిస్తునారా లేకపోతే ఆయననే కొనసాగిస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. ఏది ఎలా ఉన్నా సరే టీఆర్ఎస్  పార్టీని ఎదుర్కోవాలని భావిస్తే టీఆర్ఎస్  పార్టీ నేతల వ్యాఖ్యలకు దీటుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.


సాగ‌ర్‌లో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఖ‌రారు.. టికెట్ ఆయ‌న‌కు క‌న్ఫ‌ర్మ్ చేసిన కేసీఆర్‌...

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?

సారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిన్నమ్మ రాజకీయాల నుండి ఎందుకు తప్పుకున్నారు ?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>