PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru1585db7e-7ca3-4e92-a852-02f3609ef436-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru1585db7e-7ca3-4e92-a852-02f3609ef436-415x250-IndiaHerald.jpgఎన్నో అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ పెట్టిన క్షణం నుండి టీడీపీ కి సపోర్టుగా ఉన్నాడు. గతంలో 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషించాడు. ఇందుకు చాలా మరణాలను చెప్పొచ్చు. కానీ అంతిమంగా జగన్ గెలవకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆనాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సపోర్ట్ చేసారని ప్రతి ఒక్కరికీ తెలుసు. pura poru;pawan;cbn;modi;kalyan;bharatiya janata party;godavari river;krishna river;jagan;geum;janasena;2019;west godavari;mla;tdp;ycp;lokesh kanagaraj;janasena party;v;partyపుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?pura poru;pawan;cbn;modi;kalyan;bharatiya janata party;godavari river;krishna river;jagan;geum;janasena;2019;west godavari;mla;tdp;ycp;lokesh kanagaraj;janasena party;v;partyFri, 05 Mar 2021 14:00:00 GMTపవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించాడు. పార్టీ పెట్టిన క్షణం నుండి టీడీపీ కి సపోర్టుగా ఉన్నాడు. గతంలో 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషించాడు.  ఇందుకు చాలా మరణాలను చెప్పొచ్చు. కానీ అంతిమంగా జగన్ గెలవకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఆనాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సపోర్ట్ చేసారని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఆ తరువాత 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో జనసేన నేరుగా టీడీపీ తో కలిసి సంయుక్తంగా పోటీ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోగా, జనసేన ఒకే ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తరువాత వైసీపీ నేతగా మారిపోయాడని తెలిసిందే.

అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాలి టీడీపీ పరాజయం పాలయిందంటే దానికి రాజకీయంగా చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడే వచ్చిన జనసేన ఓడిందంటే దానికి పూర్తి కారణం మాత్రం టీడీపీ మరియు చంద్రబాబు మాత్రమే. ఒకవేళ జనసేన కానీ గత ఎన్నికలలో బీజేపీతో కలిసి పోటీ చేసి ఉంటే మోడీ ప్రభావం మరియు పవన్  కళ్యాణ్ చరిష్మా వలన  ఖచ్చితంగా కొన్ని ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని ఉండేది. ఇప్పుడు అసెంబ్లీలో అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం ఉండేది. దీనిలో పూర్తిగా టీడీపీ ఆడిన గేమ్ లో పవన్ కళ్యాణ్ పడిపోయాడని చెప్పవచ్చు. చంద్రబాబు మరియు లోకేష్ తమ ప్రచార కార్యక్రమంలో పదే పదే పవన్ మాతోనే ఉన్నాడు. మేము చెప్పిందే వింటాడు అని ఊదరగొట్టడంతో ప్రజలకు అర్ధం అయింది. టీడీపీ మీద ఉన్న ఆగ్రహంతో స్వయంగా పవన్ వీరాభిమానులు కూడా పవన్ కి ఓటేయకపోడంతో ఆఖరికి పవన్ కూడా ఓడిపోవడం జరిగింది.

ఆ తరువాత పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాలోని కాపు సామజిక వర్గానికి చెందిన వారు మరికొన్ని కులాల వారితో కలిసి మొన్న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తమ ఉనికి చాటుకున్నారు. మంచి ఫలితాలను పొందారు. అయితే ఇలాంటి జనసేనను ఇప్పుడు మళ్ళీ టీడీపీ వాడుకోవాలని చూస్తోంది. దీనికి రుజువుగా కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకటి నరసాపురం నియోజకవర్గం అయితే మరొకటి జంగారెడ్డిగూడెం. ఈ ప్రాంతాలలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి అక్కడి జనసేన నాయకులు కండువాలు కప్పుకుని ఫొటోలు దిగడం సంచలనమయింది. ఇది జనసేనాని పవన్ కి తెలిసి జరుగుతోందా..లేదా అనేది ఒక సందేహం. ఒకవేళ ఇది నిజమయితే జనసేన బీజేపీ తో పొత్తులో ఉంది కాబట్టి ఇరు పార్టీలకు నష్టం జరిగే ప్రమాదముంది. మరి దీనిని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.


పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>