MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-nithinc369ba3e-5d3e-4b14-a7f4-63d0ef2ded06-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/hero-nithinc369ba3e-5d3e-4b14-a7f4-63d0ef2ded06-415x250-IndiaHerald.jpgచంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందించిన చెక్ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. విభిన్నమైన కథతో చంద్రశేఖర్ ఏలేటి ప్రయోగం చేయాలనుకున్నారు కానీ అది బెడిసికొట్టడంతో హీరో నితిన్ బలయ్యారు. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రశేఖర్ ఏలేటి ప్రేక్షకులను మెప్పించే విధంగా చెక్ సినిమాను మలచలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చెక్ సినిమా భారీ హిట్ అయితే ఇక తనకు తిరుగు ఉండదని నితిన్ బలంగా నమ్మారు. కానీ ఆ సినిమా అనూహ్యంగాhero nithin;view;venkatesh;nithin;suresh;devi sri prasad;geetha;keerthi suresh;kirti;prasad;satya;satyam rajesh;sriram;tiru;vennela;vennela kishore;cinema;sangeetha;youtube;you tube;nenu sailaja;comedy;cheque;hero;thota chandrasekhar;heroine;local language;mahanati;romantic;nithin reddy;march;sid sriram;venky atluri;nenu local;chitramనితిన్ ఆశలన్నీ కీర్తి సురేష్ పైనేనట.. ఎందుకో తెలుసా..నితిన్ ఆశలన్నీ కీర్తి సురేష్ పైనేనట.. ఎందుకో తెలుసా..hero nithin;view;venkatesh;nithin;suresh;devi sri prasad;geetha;keerthi suresh;kirti;prasad;satya;satyam rajesh;sriram;tiru;vennela;vennela kishore;cinema;sangeetha;youtube;you tube;nenu sailaja;comedy;cheque;hero;thota chandrasekhar;heroine;local language;mahanati;romantic;nithin reddy;march;sid sriram;venky atluri;nenu local;chitramFri, 05 Mar 2021 13:30:00 GMTచంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందించిన చెక్ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. విభిన్నమైన కథతో చంద్రశేఖర్ ఏలేటి ప్రయోగం చేయాలనుకున్నారు కానీ అది బెడిసికొట్టడంతో హీరో నితిన్ బలయ్యారు. డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చంద్రశేఖర్ ఏలేటి ప్రేక్షకులను మెప్పించే విధంగా చెక్ సినిమాను మలచలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చెక్ సినిమా భారీ హిట్ అయితే ఇక తనకు తిరుగు ఉండదని నితిన్ బలంగా నమ్మారు. కానీ ఆ సినిమా అనూహ్యంగా డిజాస్టర్ కావడంతో అతని ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.


ఇదిలా ఉండగా.. నితిన్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన "రంగ్ దే" సినిమా మార్చి 26వ తేదీన విడుదల కానున్నది. తాజాగా ఈ సినిమా నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన "నా కనులు ఎప్పుడు" లిరికల్ సాంగ్ విడుదలై యూట్యూబ్ లో 2 కోట్ల 10 లక్షల వ్యూస్ పొందింది. గతంలో ఈ సినిమా నుంచి "ఏమిటో ఇది" పాట విడుదల కాగా.. అదీ మంచి హిట్ అయ్యింది. 7 నెలల క్రితం విడుదలైన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.


వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకి బిగ్గెస్ట్ అసెట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్నారు. అయితే చెక్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్న నితిన్.. ఆ ప్రభావం తన తదుపరి సినిమాపై పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ తన సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు తీసిన ఆమె ఒక్క హిట్టు కూడా సాధించలేదు కానీ ఆమె హీరోయిన్ గా నటించిన నేను శైలజ, నేను లోకల్ వంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అలాగే మహానటి సినిమాలో నటించి నంది అవార్డు కూడా గెలుచుకుని ఎనలేని పాపులారిటీని ఆమె సంపాదించుకున్నారు. అయితే ప్రేక్షకుల్లో ఆమెకున్న క్రేజ్ తన సినిమాని గట్టెక్కిస్తుందని నితిన్ భావిస్తున్నారు. అలాగే తన వంతు కృషి చేయాలన్న ఉద్దేశంతో సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరి కీర్తి సురేష్ నితిన్ కి లక్కీ చామ్ అవుతుందో లేదో చూడాలి.


మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>