MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthac91c0026-651e-4343-b0c8-92ed936ce3d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanthac91c0026-651e-4343-b0c8-92ed936ce3d7-415x250-IndiaHerald.jpg అక్కినేని కుటుంబ కోడలుగా మాత్రమే కాకుండా నటిగా సమంత కు చాల ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అలాంటి సమంత తో కలిసి నటించడానికి ఒక యంగ్ హీరోయిన్ తిరస్కరించింది అంటూ వస్తున్న గాసిప్పులు చాలా మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. తెలుగు అమ్మాయి ఇషా రెబ్బ చాల చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించింది.ఈమధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ లో కూడ ఈమె నటించింది. సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటూ తరుచూ ఆమె ఎక్స్ పోజింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ లో నటించాలి అని గట్టి ప్రయతsamantha;beauty;gunasekhar;nageshwara rao akkineni;samantha;cinema;industry;girl;heroine;net flixషాకింగ్ సమంత తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తిరస్కరించిన యంగ్ హీరోయిన్ ?షాకింగ్ సమంత తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి తిరస్కరించిన యంగ్ హీరోయిన్ ?samantha;beauty;gunasekhar;nageshwara rao akkineni;samantha;cinema;industry;girl;heroine;net flixFri, 05 Mar 2021 10:00:00 GMTఅక్కినేని కుటుంబ కోడలుగా మాత్రమే కాకుండా నటిగా సమంత కు చాల ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అలాంటి సమంత తో కలిసి నటించడానికి ఒక యంగ్ హీరోయిన్ తిరస్కరించింది అంటూ వస్తున్న గాసిప్పులు చాలా మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. తెలుగు అమ్మాయి ఇషా రెబ్బ చాల చిన్న సినిమాలలో హీరోయిన్ గా నటించింది.


ఈమధ్యనే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్ లో కూడ ఈమె నటించింది. సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటూ తరుచూ ఆమె ఎక్స్ పోజింగ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ లో నటించాలి అని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఈ యంగ్ బ్యూటీ సమంత తో కలిసి ఒక భారీ మూవీలో చేయడానికి అవకాశం వచ్చినా తిరస్కరించడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


తెలుస్తున్న సమాచారం మేరకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘శాకుంతలం’ మూవీలో ఇషా రెబ్బ కు ఒక పాత్రను గుణశేఖర్ ఆఫర్ చేసినట్లు టాక్. అయితే ఆపాత్రలో నటించడానికి ఇషా తిరస్కరించిందని తెలుస్తోంది. దీనితో ఆపాత్ర ప్రాముఖ్యత సరిపోక ఆమె తిరస్కరించిందా లేకుంటే ఆమెకు గుణశేఖర్ ఆఫర్ చేసిన పారితోషికం నచ్చక తిరస్కరించిందా అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.


ఇది ఇలా ఉంటే సమంత కు కథలు చెప్పాలని చాలామంది యంగ్ డైరెక్టర్స్ ప్రయత్నిస్తూ ఉంటే ఆమె ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు అని టాక్. దీనితో ప్రస్తుతం సమంత దృష్టి అంతా ‘శాకుంతలం’ పైనే ఉందా లేకుంటే ఈమూవీతో సమంత తన సినిమా కెరియర్ కు తాత్కాలిక విరామం ప్రకటించి కొంతకాలం గృహలక్ష్మి పాత్రను పోషించి ఆపై కొంత గ్యాప్ తీసుకుని ఆతరువాత అక్కినేని కుటుంబ వారసులు పుట్టిన తరువాత మళ్ళీ సినిమాల వైపు చూస్తుందా అంటూ ఊహాగానాలు వస్తున్నాయి..  






సింగర్ ప్రెగ్నెంట్.. నిరాశలో అభిమానులు.. అసలేమైంది..?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...

విశాఖ ఉక్కు ఉద్య‌మం ఊపందుకున్న‌ట్లేగా...పార్టీలు ఏం చేస్తున్నాయంటే...?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిలకు అంతర్జాలంలో మొత్తంగా ట్రోల్స్ - నేటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేఖత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>