SatireVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somuveerraju-pawankalyan-bjp-janasena-tirupati67a14429-cc32-49cd-97d6-86cd623acf55-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/somuveerraju-pawankalyan-bjp-janasena-tirupati67a14429-cc32-49cd-97d6-86cd623acf55-415x250-IndiaHerald.jpgమరి ఇంతోటి దానికే తమ పార్టీ బలంగా ఉందని అంటే కాదు తాము ఇంకా బలంగా ఉన్నామని నానా గోల చేసుకున్నాయి. 50 డివిజన్లలో రెండు పార్టీలు కలిసి సగం డివిజన్లలో కూడా పోటీచేయలేని పార్టీలు ఏకంగా తిరుపతి లోక్ సభ ను గెలిచేస్తామని సోది చెప్పుకుంటున్నాయి. నిజానికి రెండు పార్టీలకు కూడా లోక్ సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ తెచ్చుకునేంత సీన్ లేదన్నది వాస్తవం. అయినా పోటీ విషయంలో రెచ్చిపోయాయి. బీజేపీ 8, జనసేన 3 డివిజన్లలో పోటికి మాత్రమే ఎందుకు పరిమితమైపోయాయి. ? ఎందుకంటే పోటీ చేయటానికి ఇంతకుమించి అభ్యర్ధులు దొరకలేదు కాబsomuveerraju pawankalyan bjp janasena tirupati;darshana;tiru;bharatiya janata party;bandara;janasena;tirupati;media;husband;janasena party;partyహెరాల్డ్ సెటైర్ : ఇద్దరూ కలిసి తిరుపతిని వదిలేసినట్లేనా ?హెరాల్డ్ సెటైర్ : ఇద్దరూ కలిసి తిరుపతిని వదిలేసినట్లేనా ?somuveerraju pawankalyan bjp janasena tirupati;darshana;tiru;bharatiya janata party;bandara;janasena;tirupati;media;husband;janasena party;partyFri, 05 Mar 2021 07:00:00 GMTతొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి ఒకపుడు నేనంటే కాదు నేనంటూ తీవ్రంగా పోటీ పడ్డారు. తీరా ఉపఎన్నిక దగ్గరకు వస్తోందని అనుకుంటున్న సమయంలో ఇద్దరు మీరు పోటీ చేయండి అంటే కాదు మీరే పోటీచేయండి అని ఎదుటివాళ్ళ మీదకు తోసేస్తున్నారని అనుమానంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేయటానికి మిత్రపక్షాలు బీజేపీ, జనసేనలు చాలా తీవ్రంగా పోటీ పడిన విషయం తెలిసిందే. అలాంటిది తాజాగా పోటీలోకి మీరే దిగండని అంటే కాదు మీరే పోటీ చేయండని చెబుతున్నారట. దీనికి నిదర్శనం తిరుపతి మున్సిపాల్ కార్పొరేషన్ ఎన్నికలే నిదర్శనంగా మారింది. తిరుపతి కార్పొరేషన్లో 50 డివిజన్లుంటే బీజేపీ పోటీచేస్తున్నది 8 డివిజన్లలో. ఇక జనసేన అయితే మరీ అన్యాయం. ఈ పార్టీ పోటీ చేస్తున్నది మూడంటే మూడే డివిజన్లలో.




మరి ఇంతోటి దానికే తమ పార్టీ బలంగా ఉందని అంటే కాదు తాము ఇంకా బలంగా ఉన్నామని నానా గోల చేసుకున్నాయి. 50 డివిజన్లలో రెండు పార్టీలు కలిసి సగం డివిజన్లలో కూడా పోటీచేయలేని పార్టీలు  ఏకంగా తిరుపతి లోక్ సభ ను గెలిచేస్తామని సోది చెప్పుకుంటున్నాయి. నిజానికి రెండు పార్టీలకు కూడా లోక్ సభ ఎన్నికల్లో కనీసం డిపాజిట్  తెచ్చుకునేంత సీన్ లేదన్నది వాస్తవం. అయినా పోటీ విషయంలో రెచ్చిపోయాయి. బీజేపీ 8, జనసేన 3 డివిజన్లలో పోటికి మాత్రమే ఎందుకు పరిమితమైపోయాయి. ? ఎందుకంటే పోటీ చేయటానికి  ఇంతకుమించి అభ్యర్ధులు దొరకలేదు కాబట్టే.




బీజేపీ నేతల విషయం చూస్తే మరీ విచిత్రంగా ఉంటుంది. ఇక్కడి నేతలంతా వీవీఐపీలను ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకుని తిరుమలలో దర్శనం చేయించి తిరిగి ఎయిర్ పోర్టులో సెండాఫ్ ఇవ్వటానికి మాత్రమే పనికొస్తారు. ఇది కాకపోతే టీవీల్లో లైవ్ ఇన్ ప్రోగ్రాములో లేకపోతే మీడియా సమావేశాల్లో మాత్రమే గొప్పలు చెప్పుకుంటారంతే. క్షేత్రస్ధాయిలో పట్టు పెంచుకుందామని ఎవరికీ లేదు. ఎందుకంటే రోడ్లపైకి వచ్చి జనాలతో మమేకమై అవసరమైన కమ్యూనిటి అవసరాలు తీర్చేంత సీన్ వీళ్ళకు లేదు. ఎంతసేపు నరేంద్రమోడిని చూపించి ఇక్కడ కతలు చెప్పటం మాత్రమే వీళ్ళకి తెలిసిందే. అందుకనే వీళ్ళకు జనాల్లో గుర్తింపుంటుంది కానీ పలుకుబడి ఉండదు. కాబట్టే పోటీ చేయించేందుకు ఆసక్తి చూపలేదు. ఒకవేళ అన్నీ డివిజన్లలోను పోటీ చేస్తే వాళ్ళని గెలిపించేందుకు తిరగాలి. వీళ్ళు తిరిగినా ఎవరు ఓట్లేయరు. అప్పుడు వీళ్ళ బండారం బయటపడుతుంది. అందుకనే ఘనత వహించిన బీజేపీ 8 డివిజన్లకు మాత్రమే పరిమితమైనా నేతలు ఎవరు సిగ్గుపడలేదు. ఇలాంటి పార్టీ లోక్ సభ ఉపఎన్నికలో గెలిచేస్తుందని చెబితే ఎవరైనా నమ్ముతారా ?




తలలో దురద ఎక్కువ అయితే ఏం చేయాలో తెలుసా..?

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?

సారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిన్నమ్మ రాజకీయాల నుండి ఎందుకు తప్పుకున్నారు ?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>