PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/telangana-governor-shocking-comments-on-kcr79e55581-9c53-4f7b-befa-02fdb8823167-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/telangana-governor-shocking-comments-on-kcr79e55581-9c53-4f7b-befa-02fdb8823167-415x250-IndiaHerald.jpgతెలంగాణ గవర్నర్ ను మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు గత కొంత కాలంగా మనం వింటూనే ఉన్నాం. అయితే తెలంగాణ గవర్నర్ మాత్రం ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రాజభవన్ కి మాత్రమే పరిమితమైన ఆమె... ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని సంకేతాలు ఇస్తున్నారు. త్వరలోనే ఆమె గిరిజన ప్రాంతాల్లో పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.tamilsye,ts;kcr;bharatiya janata party;telangana;governor;adilabad;v;partyప్రజల్లోకి గవర్నర్... కేసీఆర్ కు ఇబ్బందేప్రజల్లోకి గవర్నర్... కేసీఆర్ కు ఇబ్బందేtamilsye,ts;kcr;bharatiya janata party;telangana;governor;adilabad;v;partyFri, 05 Mar 2021 13:13:47 GMTతెలంగాణ గవర్నర్ ను మార్చే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు గత కొంత కాలంగా మనం  వింటూనే ఉన్నాం. అయితే తెలంగాణ గవర్నర్ మాత్రం ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వాన్ని కాస్త ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు రాజభవన్ కి మాత్రమే పరిమితమైన ఆమె... ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు అని సంకేతాలు ఇస్తున్నారు. త్వరలోనే ఆమె గిరిజన ప్రాంతాల్లో పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.

అయితే ఇప్పుడు అదిలాబాద్ జిల్లాలో ఆమె పర్యటించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో చాలా వరకు కూడా గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నారని భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె అదిలాబాద్ జిల్లాలో పర్యటన చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని అంటున్నారు. అధికారులు కూడా అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అని సమాచారం.

ఇక నిజామాబాద్ జిల్లాలో ఆమె పర్యటించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. పర్యటించడానికి ఇప్పటికే ఆమె ఒక రోడ్డు మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారని సమాచారం. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఈ పరిస్థితులు మాత్రం ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడానికి బిజెపి అధిష్టానం కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ పాత్ర చాలా కీలకంగా మారుతుందని చెప్పాలి. మరి గవర్నరుగా ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తారు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల విషయంలో ఆమె ఎలా వ్యవహరిస్తారు అనేది చూడాలి.


నితిన్ ఆశలన్నీ కీర్తి సురేష్ పైనేనట.. ఎందుకో తెలుసా..

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>