MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarangadariya-suddala011e616b-f8c5-4d85-9414-41c605d5a371-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarangadariya-suddala011e616b-f8c5-4d85-9414-41c605d5a371-415x250-IndiaHerald.jpgసారంగ దరియా సాంగ్.. ఇప్పుడు నెట్‌లో ఇదో ట్రెండ్‌ సెట్టింగ్ సాంగ్.. సాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సారంగదరియా సాంగ్‌ అదరగొట్టేస్తోంది. ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ దాటి పోయింది. అయితే ఈ పాట రచయిత సుద్దాల్ అశోక్‌ తేజపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సుద్దాల అశోక్‌తేజ.. ఓ జానపద గsarangadariya-suddala;view;sekhar;sri sri;kamma;telangana;cinema;writer;vegetable market;coffee;magadheera;sai pallavi;fidaaసారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?సారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?sarangadariya-suddala;view;sekhar;sri sri;kamma;telangana;cinema;writer;vegetable market;coffee;magadheera;sai pallavi;fidaaFri, 05 Mar 2021 06:00:00 GMTసాయి పల్లవి అంటేనే కుర్రకారులో ఓ క్రేజ్.. అందానికి అందం.. నటన, డ్యాన్స్ అన్నీ కలగలపిన సాంగ్.. అందుకే నెట్‌ను ఊపేస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సారంగదరియా సాంగ్‌ అదరగొట్టేస్తోంది. ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ దాటి పోయింది.

అయితే ఈ పాట రచయిత సుద్దాల్ అశోక్‌ తేజపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సుద్దాల అశోక్‌తేజ.. ఓ జానపద గీతాన్ని తన పైత్యంతో చెడగొట్టాడని.. ఏవో నాలుగు వాక్యాలు రాసి ఈ పాట రచయితగా చెప్పుకుంటున్నాడని విమర్శిస్తున్నారు. గుర్రం సీతారాములు అనే వ్యాసకర్త ఇలా విమర్శించారు..

“ సుద్దాల అశోక్‌ తేజా.. నా బిడ్డలు పాడిన పాటను అతుకుల బొంత జేసి కాక్ టైల్ డిజేలా చేస్తున్నావ్ ? తెలంగాణా బిడ్డ అని చెప్పుకొని తెలంగాణ అమరవీరుల మీద ఎన్ని పాటలు రాశావ్..? సారంగ దరియాలో సగం పాట నా అమ్మ అక్కలు తరాలుగా పాడారు పాడుకుంటున్నారు. నాలుగు తొడుగుల వాక్యాలు అతుకేసి మార్కెట్ లో అమ్ముకుని నన్ను జానపదం ఆవహించింది అంటావ్, అలా చెప్పుకోవడం అంత నీచం లేదు.

నేను సైతం నేను సైతం అన్న పాట సగం కాపీ.. దానికి జాతీయ అవార్డు ఇచ్చినవాడు ఎలాగో బుర్ర లేని వెధవ… ఏ ఒక్క రోజయినా ఆ పాట ప్రజా కవిత్వం పెట్టిన బిక్ష అన్నావా..? అది నీకయినా, శ్రీ శ్రీ కయినా..? పాటను సగం కొట్టేసినా ఒక్క విరసం నాయకుడూ అది తప్పు అని అన్నారో లేదో నాకు తెలియదు. కానీ మగధీర లో తన రెండు వాక్యాలు కొట్టేసి వాడుకున్నందుకు నిలదీసిన వంగపండుని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసాడు అని కూస్తిరి. కలేకూరి, శివసాగర్, గద్దర్ పాటలు సినిమాలలో ఉన్నాయి అంటే దానికొక లక్ష్యం ఉంది. ఉద్యమ రాజకీయాలకు ఆ పాటలు ఒక మద్దతు వాక్యాలు అయ్యాయి. మరి నువ్వేం చేస్తున్నావ్ గ్రంధ సాంగుడా అలియాస్ సారంగ దరుడా ?

సారంగదరియా పాటను కాపీ కొట్టిన ‘కాపీ’ రాతగాడు, ‘కాఫీ’ సినిమా రాయుడు శేఖర్ కమ్ముల రేలా రే గాయనికి క్రెడిట్ ఇస్తారా ? యూ ట్యూబ్ క్లిక్స్ గొప్పలు చెప్పుకుంటారా..? ఏవిరా మీవల్ల ఈ పాటకి పరంపర కి ఒరిగింది ?.. అంటూ విమర్శించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వ్యాసంపై చర్చ సాగుతోంది.




భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>