PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-revanth-reddy-hot-comments-on-cm-kcrc75da66b-2827-46b3-b5eb-170f3d1d7482-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mp-revanth-reddy-hot-comments-on-cm-kcrc75da66b-2827-46b3-b5eb-170f3d1d7482-415x250-IndiaHerald.jpgముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడే.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ ధైర్యం లేదన్నారు. ప్రధాని మోడీ అంటే కేసీఆర్‌కు చలి జ్వరమని వ్యంగ్యాస్త్రం సంధించారు రేవంత్ రెడ్డి. kcr fever;modi;kcr;ramu;revanth;tiru;hyderabad;warangal;telangana;revanth reddy;congress;mp;huzur nagar;nalgonda;prime minister;chief minister;ranga reddy;central government;reddy;mahbubnagar;nayak;partyకేసీఆర్ కు చలి జ్వరం!కేసీఆర్ కు చలి జ్వరం!kcr fever;modi;kcr;ramu;revanth;tiru;hyderabad;warangal;telangana;revanth reddy;congress;mp;huzur nagar;nalgonda;prime minister;chief minister;ranga reddy;central government;reddy;mahbubnagar;nayak;partyFri, 05 Mar 2021 20:10:45 GMTముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడే.. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ ధైర్యం లేదన్నారు. ప్రధాని మోడీ అంటే కేసీఆర్‌కు చలి జ్వరమని వ్యంగ్యాస్త్రం సంధించారు రేవంత్ రెడ్డి.  ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూకట్ పల్లిలో నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్, మోడీ ఒకే నాణేనికి బొమ్మాబొరుసని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఐటీఐఆర్‌ రాలేదని కేటీఆర్‌ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని, ఆ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర ఆమరణ దీక్ష చేద్దామని రేవంత్ పిలుపునిచ్చారు. కేటీఆర్‌కు దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. లక్షా 91వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న మోడీతో ఎందుకు జతకట్టాడో కేసీఆర్ చెప్పాలన్నారు. విజ్ఞులైన పట్టభద్రులు ఆలోచించి ఓటు వేసి.. తమ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి.  

ఉద్యోగాలు ఇస్తామని మోడీ, కేసీఆర్ ప్రజలను మోసం చేశారని రేవంత్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్రానికి మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేశారని ఆయన ఆరోపించారు. ఖాజీపేటకు ఇస్తానన్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు రేవంత్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో రాములు నాయక్ , హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో చిన్నారెడ్డిని గెలిపించాలని పట్టభద్రులు, ఉద్యోగులను కోరారు ఎంపీ రేవంత్ రెడ్డి.


పెట్రో ప‌న్నుల‌పై ఆర్థిక‌మంత్రి నిర్మ‌ల త‌న‌దైన శైలిలో వివ‌ర‌ణ‌... ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు..

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>