Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/plastic-surgeryc774d03a-2f26-453e-917c-42c695abab81-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/plastic-surgeryc774d03a-2f26-453e-917c-42c695abab81-415x250-IndiaHerald.jpgచిన్న మాట ఎవరైనా అంటేనే అవమానంగా భావిస్తాం. రోజుల తరబడి బాధపడతాం. మనల్ని అవమానించిన వారికి బుధ్ధి చెప్పాలనుకుంటాం. వారిని ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోవాలనుకుంటాం. అలాగే జీవితంలో ఎదురయ్యే అవమానాలు కొంత మందిని దుర్మార్గులుగా మార్చితే కొంతమందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. విజయత్నాంకు చెందిన ఓ యుకవుడు..plastic surgery;jeevitha rajaseskhar;american samoa;doctor;chequeఅవమానిస్తున్నారని 9 ప్లాస్టిక్ సర్జరీలు.. ఇంత అందంగా మారడేండి..?అవమానిస్తున్నారని 9 ప్లాస్టిక్ సర్జరీలు.. ఇంత అందంగా మారడేండి..?plastic surgery;jeevitha rajaseskhar;american samoa;doctor;chequeFri, 05 Mar 2021 17:43:00 GMTఇంటర్నెట్ డెస్క్: చిన్న మాట ఎవరైనా అంటేనే అవమానంగా భావిస్తాం. రోజుల తరబడి బాధపడతాం. మనల్ని అవమానించిన వారికి బుధ్ధి చెప్పాలనుకుంటాం. వారిని ఏదో ఒకటి చేసి పగ తీర్చుకోవాలనుకుంటాం. అలాగే జీవితంలో ఎదురయ్యే అవమానాలు కొంత మందిని దుర్మార్గులుగా మార్చితే కొంతమందిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. విజయత్నాంకు చెందిన ఓ యుకవుడు కూడా అలాంటి అవమానాలే ఎదుర్కొన్నాడు. అయితే ఆ అవమానాలు అతడిని ఎలా మర్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

వియ‌త్నాంకు చెందిన 26 ఏళ్ల డూ కూయెన్‌ ఏ ఇంట‌ర్వ్యూకి వెళ్లినా అక్క‌డ అవ‌మానాలు ఎదుర‌య్యేవి. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తులు అత‌ని మొహాన్ని చూసి హేళన చేసేవారు. దీంతో అతడు చాలా బాధపడేవాడు. ఆ యువ‌కుడికి త‌న మొహంపై అస‌హ్యం వేసింది. ఎలాగైనా త‌న ముఖాన్ని అందంగా మార్చుకోవాల‌ని అనుకున్నాడు. అసలు తాను ఎలా అందంగా ఉంటానో తెలుసుకునేందుకు మేక‌ప్ ఆర్టిస్ట్‌గా ఉద్యోగం సంపాదించాడు. అలా పనిచేస్తూనే దాదాపు రూ.12 ల‌క్ష‌లకు పైగా వెనకేశాడు. దాని కోసం సంపాదించిన ప్రతి రూపాయి దాచాడు.

చివరికి వాటన్నింటినీ తీసుకెళ్లి.. ఓ ప్లాస్టిక్ సర్జన్‌ను కలిశాడు. తన ముఖానికి సర్జరీ చేసి అందంగా మార్చాలని కోరాడు. దాంతో ఆ డాక్టర్ అతడి ముఖాన్ని చెక్ చేసి, పూర్తిగా మార్చాలంటే అనేక సర్జరీలు చేయాలని చెప్పాడు. దానికి కూయెన్ ఒప్పుకున్నాడు. దీంతో డాక్టర్ల అతడి ముఖానికి 9 స‌ర్జ‌రీలు చేసి అందంగా మార్చారు. ఇక ఆ సర్జరీల తరువాత కూయెంగ్‌ ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పుడు అతడిని ఎవరైనా చూస్తే కచ్చితంగా ఏవరో అమెరికా అబ్బాయేమో అనుకుంటారు. అలా మారిపోయాడు.

తన రూపం పూర్తిగా మార్చుకున్న కూయెన్.. స‌ర్జ‌రీకి ముందు ఫొటోను, ఇప్ప‌టి ఫొటోను తన టిక్ టాక్ ఖాతాలో షేర్ చేశాడు. అందులో తాను ఎదుర్కొన్న అవ‌మానాలు, ఛీత్కారాల‌ను వివ‌రించాడు. ఆ రెండు ఫొటోలు చూసిన నెటిజన్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ముఖం మారిన తర్వాత ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు కూడా తనని గుర్తుపట్టలేకపోయారని ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.





సరికొత్త రికార్డు సృష్టించిన జాతి రత్నాలు ట్రైలర్..

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>