PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp9bc8ee98-d702-449a-83e3-bea29ecc4596-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-tdp9bc8ee98-d702-449a-83e3-bea29ecc4596-415x250-IndiaHerald.jpgవిశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలలో అటు అధికార పార్టీ, ఇటు విపక్ష తెలుగుదేశం పోటీ పడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి. మేయర్ పీఠం తమదే కావాలని రెండు పార్టీలు చేస్తున్న విసృత ప్రచారంతో సాగర నగరం హోరెత్తిపోతోంది. విశాఖలో ఎటు చూసినా ఇపుడు ఎన్నికల సందడే కనిపిస్తోంది. ycp tdp;jagan;andhra pradesh;telugu;vishakapatnam;air;fort;tdp;ycp;partyపుర పోరు : విశాఖలో బలంగా ఆ పార్టీ గాలి ?పుర పోరు : విశాఖలో బలంగా ఆ పార్టీ గాలి ?ycp tdp;jagan;andhra pradesh;telugu;vishakapatnam;air;fort;tdp;ycp;partyFri, 05 Mar 2021 09:57:17 GMTవిశాఖ నగర పాలక సంస్థ ఎన్నికలలో అటు అధికార పార్టీ, ఇటు విపక్ష తెలుగుదేశం పోటీ పడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నాయి.  మేయర్ పీఠం తమదే కావాలని రెండు పార్టీలు చేస్తున్న విసృత ప్రచారంతో సాగర నగరం హోరెత్తిపోతోంది. విశాఖలో ఎటు చూసినా ఇపుడు ఎన్నికల సందడే కనిపిస్తోంది.

గెలుపు మాదే, అన్ని సీట్లూ మేమే గెలుచుకుంటామని అధికార పార్టీ వైసీపీ ఓ వైపు జబ్బలు చరుస్తోంది. మొత్తం 98 వార్డులకు గానూ ఏకంగా 75కు పైగాగానే వైసీపీ గెలుస్తుంది అని అంటున్నారు. వైసీపీ గాలి విశాఖలో బలంగా వీస్తోందని, జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షే పధకాలే వైసీపీని గెలిపిస్తాయని కూడా ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు.  మరో వైపు చూస్తే టీడీపీ కూడా విశాఖలో తమకే అనుకూల గాలి వీస్తోందని చెబుతోంది. తాము విశాఖ మేయర్ సీటుని గెలుచుకోవడం తధ్యమని కూడా అంటోంది. విశాఖ మొదటి నుంచి టీడీపీకి కంచుకోట అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు అంటున్నారు. విశాఖలో పసుపు జెండా ఎగరడం ఖాయమని ఆయన చెబుతున్నారు. మెజారిటీ సీట్లు తాము గెలుచుకుని వైసీపీకి గట్టి గుణపాఠం చెబుతామని కూడా హెచ్చరిస్తున్నారు.

మరి ఈ రెండు పార్టీలు తమకు తాముగా విశాఖ మాదే అని క్లెయిం చేసుకుంటున్నాయి. కానీ విశాఖలో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎవరికి అనుకూలం అంటే ఇప్పటిదాకా చూస్తే స్లమ్ ఏరియాలు, రూరల్ బేస్డ్ ప్రాంతాల్లో మాత్రమే ఎన్నికల పట్ల అసక్తి కనిపిస్తోంది. సిటీలో మాత్రం రాజకీయ పార్టీలను ఎన్నికలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. మరి పోలింగునకు సిటీ జనం వస్తారా ఓటేస్తారా అన్నది కూడా  చూడాలి. ఇక నగర వాసులల్లో మాత్రం రాజకీయ పార్టీల పట్ల పెద్దగా ఆదరణ కనిపించడం లేదన్నది వాస్తవం. రాజకీయ పార్టీల తీరుతో జనం విసిగిపోయారా అన్నది కూడా చర్చకు వస్తోంది.






కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...

విశాఖ ఉక్కు ఉద్య‌మం ఊపందుకున్న‌ట్లేగా...పార్టీలు ఏం చేస్తున్నాయంటే...?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిలకు అంతర్జాలంలో మొత్తంగా ట్రోల్స్ - నేటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేఖత

ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. దాని పేరు పి-1




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>