PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-ts-ycp-janga-tdp-central-modi0a3a6017-0f84-49f1-9fe9-df346df04711-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-ts-ycp-janga-tdp-central-modi0a3a6017-0f84-49f1-9fe9-df346df04711-415x250-IndiaHerald.jpgఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టాల హామీల‌ను కేంద్ర ప్రభుత్వం తుంగ‌లో తొక్కుతోంది. 2014లో అధికారంలోకి వ‌చ్చేముందు ఎన్నిక‌ల స‌భ‌ల్లో పాల్గొన్న న‌రేంద్ర‌మోడీ ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింద‌ని ముల‌సి క‌న్నీరు కార్చారు. తాము అధికారంలోకి వ‌స్తే విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలే కాకుండా ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని నిర్మాణానికి కూడా చేయూత‌నందిస్తామ‌ని చెప్పారు. ఆ మాట‌ల‌న్నీ ఒట్టి డొల్ల‌మాట‌లేన‌ని క్ర‌మేణా ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వ‌సాగింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం దిగిపోయింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.ap, ts, ycp, janga, tdp, central, modi;korcha;amaravati;andhra pradesh;congress;district;telugu;paritala ravindra;central government;ycp;sattenapalle;tadikonda;thadikonda;pettaఏపీని తొక్కేస్తున్న జ‌గ‌న్‌ఏపీని తొక్కేస్తున్న జ‌గ‌న్‌ap, ts, ycp, janga, tdp, central, modi;korcha;amaravati;andhra pradesh;congress;district;telugu;paritala ravindra;central government;ycp;sattenapalle;tadikonda;thadikonda;pettaThu, 04 Mar 2021 11:51:00 GMTఆంధ్రప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టాల హామీల‌ను కేంద్ర ప్రభుత్వం తుంగ‌లో తొక్కుతోంది. 2014లో అధికారంలోకి వ‌చ్చేముందు ఎన్నిక‌ల స‌భ‌ల్లో పాల్గొన్న న‌రేంద్ర‌మోడీ ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసింద‌ని ముల‌సి క‌న్నీరు కార్చారు. తాము అధికారంలోకి వ‌స్తే విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలే కాకుండా ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని నిర్మాణానికి కూడా చేయూత‌నందిస్తామ‌ని చెప్పారు. ఆ మాట‌ల‌న్నీ ఒట్టి డొల్ల‌మాట‌లేన‌ని క్ర‌మేణా ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌వ‌సాగింది. తెలుగుదేశం ప్ర‌భుత్వం దిగిపోయింది. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. తాజాగా కేంద్రం ప్ర‌క‌ట‌న‌తో తాము కూర్చున్న కొమ్మ‌ను తామే న‌రుక్కుంటున్నార‌నే రీతిలో ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక్క‌డి ప్ర‌భుత్వానికి రాష్ట్రాభివృద్ధిపై ఎటువంటి ఆస‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్ల‌యింది.

అమరావతి రైల్వేలైన్ విషయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ఆసక్తిగా లేదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అమరావతి రైల్వేలైన్‌‌ ప్రాజెక్టుపై ఇన్నాళ్లు ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రజలకు నిరాశే మిగిలింది. అమరావతి రైల్వేలైన్‌ ఖర్చు పంచుకోవడానికి కూడా అక్క‌డి ప్ర‌భుత్వం  సిద్ధంగా లేదని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది.  అందుకే ఆ హామీలను పక్కనెట్టినట్లు స్పష్టం చేసింది. మరోవైపు.. తెలంగాణలోనూ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ అనవసరమని కేంద్రం తేల్చింది. ఈ ప్రకటనలతో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోతొక్కినట్టయ్యిందని తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఎక్కడా రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అవసరంలేదని రైల్వేశాఖ తేల్చిచెప్పడం గమనార్హం. అమరావతికి రైల్వే ప్రాజెక్టును ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా గుంటూరు స‌మీపంలోని నంబూరు వరకు 28 కిలోమీటర్ల సింగిల్‌ లైన్‌ను ప్రతిపాదించారు. కృష్ణాజిల్లా పెద్దాపురం మీదుగా చిన్నారావు పాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పవరం, నంబూరు వరకు ఈ మార్గాన్ని సిద్ధం చేయాల‌నుకున్నారు. అమరావతి నుంచి తిరిగి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరస‌రావుపేట వరకు 25 కిలోమీటర్లు సింగిల్‌ లైన్లను కూడా అప్పట్లో ప్రతిపాదించారు. ప్ర‌భుత్వాలు మారిన త‌ర్వాత రైల్వే లైన్ల సంగ‌తి అటుంచితే క‌రోనా పుణ్య‌మా అని ఉన్న రైళ్లు కూడా తిర‌గ‌డంలేదు. ఒక‌ర‌కంగా తెలుగువాడి ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్ల‌యింది.


వాళ్ళ కెరీర్ కలర్ ఫుల్ గా ఉన్నట్లేనా...?

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>