PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr563a1e8e-8e77-41ac-8710-446bde66ded5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr563a1e8e-8e77-41ac-8710-446bde66ded5-415x250-IndiaHerald.jpgతెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో ఆయన దూకుడుగా వెళ్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తోంది అని కూడా చాలామంది అంటున్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక రాష్ట్ర పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విధంగా పదే పదే విమర్శలు చేస్తూ రావడం కూడా సీఎం కేసీఆర్ కు కాస్త ఇబ్బందికరంగానే ఉkcr,trs,ts;kcr;bhavana;revanth;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;government;allu sneha;reddy;dookudu;partyరేవంత్ దెబ్బ... కేసీఆర్ కీలక నిర్ణయం...?రేవంత్ దెబ్బ... కేసీఆర్ కీలక నిర్ణయం...?kcr,trs,ts;kcr;bhavana;revanth;delhi;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;revanth reddy;congress;government;allu sneha;reddy;dookudu;partyThu, 04 Mar 2021 20:00:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో ఆయన దూకుడుగా వెళ్తే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేస్తోంది అని కూడా చాలామంది అంటున్నారు. తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నా సరే భారతీయ జనతా పార్టీ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక రాష్ట్ర పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంను ఇబ్బంది పెట్టే విధంగా పదే పదే విమర్శలు చేస్తూ రావడం కూడా సీఎం కేసీఆర్ కు కాస్త ఇబ్బందికరంగానే ఉంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని అంశాలను కాస్త సీరియస్గా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాస్త స్పీడ్ పెంచింది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచే అవకాశాలు ఉంటాయి. అందుకే సీఎం కేసీఆర్ ఇప్పుడు కాస్త జాగ్రత్త పడుతున్నట్టు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీఎం కేసీఆర్ ముందు నుంచి కూడా బీజేపీతో రహస్య స్నేహం చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో సీఎం కేసీఆర్ కలిసి వెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో సఖ్యత కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించే అవకాశాలు లేవు అని అందుకే ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకి వెళ్ళడానికి సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారని టాక్. తెలంగాణలో టీజేఎస్ పార్టీని అలాగే మజ్లీస్ ని సీఎం కేసీఆర్ దూరం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల హైదరాబాదులో మేయర్ ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీకి సహకరించిన మజ్లీస్ పార్టీతో ఎలాంటి ఇబ్బందులు లేవు. కాంగ్రెస్ పార్టీ గనుక ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళితే ఇబ్బందులు ఉంటాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయితే మాత్రం నాయకత్వం సమర్థవంతంగా ఉంటుంది.


సలార్ సినిమా కు భారీ OTT ఆఫర్.. ఇండియా లోనే ఏ చిత్రానికి..?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>