PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-ap-breaking8b57f0bb-69ae-45fe-a980-317a98fa2452-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-ap-breaking8b57f0bb-69ae-45fe-a980-317a98fa2452-415x250-IndiaHerald.jpgఅక్క‌డ అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఎవ‌రికి వారే ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోను త‌మ పార్టీ జెండానే ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో అక్క‌డి న‌గ‌ర పంచాయితీ ఎన్నిక రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఉప‌సంహ‌ర‌ణ‌లు, ప్ర‌లోభాల ప‌ర్వం ష‌రామాములుగానే సాగుతోంది. tdp, ycp, ap, breaking;hari;hari music;district;scheduled tribes;panchayati;k s ravikumar;mla;tdp;ycp;gottipati ravi kumar;addanki;partyపుర‌పోరు: అక్క‌డ హైడ్రామా.. ఎత్తుకు పై ఎత్తులుపుర‌పోరు: అక్క‌డ హైడ్రామా.. ఎత్తుకు పై ఎత్తులుtdp, ycp, ap, breaking;hari;hari music;district;scheduled tribes;panchayati;k s ravikumar;mla;tdp;ycp;gottipati ravi kumar;addanki;partyThu, 04 Mar 2021 13:31:35 GMTఅక్క‌డ అధికార పార్టీ, ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. ఎవ‌రికి వారే ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోను త‌మ పార్టీ జెండానే ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. దీంతో అక్క‌డి న‌గ‌ర పంచాయితీ ఎన్నిక రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఉప‌సంహ‌ర‌ణ‌లు, ప్ర‌లోభాల ప‌ర్వం ష‌రామాములుగానే సాగుతోంది.

ప్ర‌కాశం జిల్లా అద్దంకి నగర పంచాయతీ ఎన్నక రాజకీయం రసవత్తరంగా మారింది. 8వ వార్డులో వైసీపీ, టీడీపీ తరపున నామినేషన్లు వేసిన నలుగురూ ఉపసంహరించుకున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు పోటీ నుంచి తప్పుకోగా, వైసీపీ నుంచి నామినేషన్‌ వేసిన ఇద్దరూ వైదొలిగారు. ఈ సందర్భంగా పెద్ద హైడ్రామా నడిచింది. నగర పంచాయతీలోని 8వ వార్డు ఎస్టీ జనరల్‌కు రిజర్వు అయింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్క‌డి నాయ‌కులంతా వైసీపీ పంచన చేరారు. ఈ ప్రభావం 8వ వార్డు నుంచి నామినేషన్లు వేసిన వారిపై పడింది. ఇరు పార్టీల నుంచి నామినేషన్లు వేసిన నలుగురు అభ్యర్థులు అదృశ్యమయ్యారు. వీరిలో టీడీపీ తరఫున నామినేష న్లు వేసిన ఇద్దరితోపాటు, తమ పార్టీ నుంచి పోటీలో ఉన్న వారిలో ఒక‌ర్ని వైసీపీ నాయకులు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. దీన్ని గుర్తించిన టీడీపీ నేతలు వైసీపీ నుంచి బరిలో ఉన్న వ్య‌క్తిని తమ అదుపులోకి  తీసుకున్నారు.

ఇలా నలుగురు అభ్యర్థులను 10 రోజుల నుంచి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంచారు. వైసీపీ తరఫున ఎన్నిక ఏకగ్రీవమ‌వుతుందని ఆ పార్టీ నాయకులు భావించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసే సమయానికి ఎమ్మెల్యే రవికుమార్ రంగ‌ప్ర‌వేశంతో సీను మారింది. 8వ వార్డులో ఒక్కరు కూడా పోటీలో లేకపోవడంతో అక్కడ ఎన్నికకు బ్రేక్‌ పడింది. మిగిలిన  19 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నిక‌లు స‌జావుగా సాగుతాయా? అధికార పార్టీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌తిప‌క్ష పార్టీకి చెందిన అభ్య‌ర్థులు ప్ర‌చారానికి దూరంగా ఉంటార‌నే విష‌యం తెలుస్తోంది.


గంటా..మంట. తంటా...?

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>