PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0287b1d6-70fc-4104-a1f3-e134ac3902c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections0287b1d6-70fc-4104-a1f3-e134ac3902c8-415x250-IndiaHerald.jpgఏపి లో రసవత్తరంగా మారినా నామినేషన్ల ఉపసంహరణ పక్రియ రసాభాసగా మారింది. పంచాయితీ ఎన్నికలకు మించి ఏకగ్రీవాలు జరిగాయి. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.. అభ్యర్థుల తుది జాబితాను కూడా ఎన్నికల కమీషనర్ విడుదల చేశారు. అయితే అందరి దృష్టి చిత్తూరు, కడప పైనే ఉంది. పంచాయితీ ఎన్నికలలో జరిగిన తంతు ఇక్కడా కొనసాగుతుంది. jagan-nimmagadda-elections;hari;hari music;tiru;andhra pradesh;ram madhav;kadapa;tirupati;panchayati;minister;husband;pulivendula;ycp;research and analysis wing;nagari;madanapalli;rayachotyపుర పోరు: చిత్తూరు, కడపలో ఏకగ్రీవాల వివరాలు ఇవే..!పుర పోరు: చిత్తూరు, కడపలో ఏకగ్రీవాల వివరాలు ఇవే..!jagan-nimmagadda-elections;hari;hari music;tiru;andhra pradesh;ram madhav;kadapa;tirupati;panchayati;minister;husband;pulivendula;ycp;research and analysis wing;nagari;madanapalli;rayachotyThu, 04 Mar 2021 10:01:19 GMTఏపి లో రసవత్తరంగా మారినా నామినేషన్ల ఉపసంహరణ పక్రియ రసాభాసగా మారింది. పంచాయితీ ఎన్నికలకు మించి ఏకగ్రీవాలు జరిగాయి. మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. ఎన్నికలు జరుగనున్న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 17,418 నామినేషన్లు దాఖలు కాగా, 2,900 మందికిపైగా అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.. అభ్యర్థుల తుది జాబితాను కూడా ఎన్నికల కమీషనర్ విడుదల చేశారు. అయితే అందరి దృష్టి చిత్తూరు, కడప పైనే ఉంది. పంచాయితీ ఎన్నికలలో జరిగిన తంతు ఇక్కడా కొనసాగుతుంది.


మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఈనెల 10న జరుగనుండగా, 14న ఫలితాలు వెలువడునున్నాయి. ఇక ఏకగ్రీవాల విషయానికొస్తే.. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తన హవాను కొనసాగించింది. చిత్తూరు , కడప జిల్లాల్లో  ఒకసారి చూస్తే..చిత్తూరు కార్పొరేషన్‌ పరిధలోని 50 డివిజన్లకు గాను 37 డివిజన్లు ఏకగ్రీవం కావడంతో ఎన్నికలతో సంబంధం లేకుండా కార్పొరేషన్‌ను వైఎస్సార్సీపీ కైవసం చేసుకంది. దీంతోపాటు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు కూడా వైఎస్సార్సీపీ ఖాతాలో చేరాయి. మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఇలాకా పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 31 వార్డులను వైఎస్సార్సీపీ ఏకగ్రీవం చేసుకుంది.


ఇకపోతే పలమనేరు మున్సిపాలిటీలో 26 వార్డులకు గాను 18 వార్డులు, నగరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మదనపల్లి మున్సిపాలిటీలో 35 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. తిరుపతి కార్పొరేషన్‌ పరిధిలోని 19 డివిజన్లను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. కడపలో వైసీపీకి తిరుగులేదు.పులివెందుల మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 33 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయచోటి మున్సిపాలిటీలోని 34కు 34 వార్డులు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీ లోని 20 వార్డుల్లో 13 స్థానాల్లో, బద్వేలు మున్సిపాలిటీలోని 35 వార్డులకు గాను 10 వార్డుల్లో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 41 వార్డులకు గాను 9 వార్డుల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు... కడప పరిధిలో మొత్తం 50 డివిజన్లలో 23 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..


పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>