PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/devotees-hospitalised-in-srisailam66eea663-f56f-4422-ac0c-bfa91c29aa0e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/devotees-hospitalised-in-srisailam66eea663-f56f-4422-ac0c-bfa91c29aa0e-415x250-IndiaHerald.jpgఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో ఉన్నట్టుండి కలకలం రేగింది. భక్తులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా కడుపు నొప్పి అంటూ పడిపోయారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఫుడ్ పాయిజనింగ్ జరిగిందేమోనన్న అనుమానంతో సున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు అధికారులు. srisailam;darshana;shiva;district;lord siva;local language;srisailam;sunnipentaశ్రీశైలంలో కలకలం.. 25మంది భక్తులకు అస్వస్థత..శ్రీశైలంలో కలకలం.. 25మంది భక్తులకు అస్వస్థత..srisailam;darshana;shiva;district;lord siva;local language;srisailam;sunnipentaThu, 04 Mar 2021 07:00:00 GMTసున్నిపెంట ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు అధికారులు.

అసలేం జరిగింది..
అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం నెరజాం గ్రామానికి చెందిన 120 మంది భక్తులు శ్రీశైలంలో శివుడి దర్శనంకోసం వచ్చారు. బుధవారం మధ్యాహ్నం వారు శ్రీశైలంకి చేరుకున్నారు. సాయంత్రం స్వామివారి దర్శనం చేసుకుని, రాత్రికి శ్రీశైల క్షేత్రంలోనే నిద్రించేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మధ్యాహ్నం తమతోపాటు తీసుకొచ్చిన ఆహారాన్ని తిన్నారు. అయితే ఒక్కసారిగా వారిలో కొంతమంది కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడ్డారు. ఒకరితో ఒకరు ఇలా మొత్తం 25మంది కడుపు నొప్పి అంటూ పడిపోయారు. కడుపునొప్పితోపాటు వాంతులు, విరేచనాలు కూడా అయ్యాయి. దీంతో మిగతావారంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే 108కి సమాచారమిచ్చారు.

108సాయంతో అస్వస్థతకు గురైన భక్తుల్ని వెంటనే సున్నిపెంటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆస్పత్రి సిబ్బంది వారికి హుటాహుటిన సెలైన్లు పెట్టి వైద్యం అందించారు. ఈ క్రమంలో వారు కోలుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఆహారం వల్లే ఇబ్బంది పడ్డారా..?
సాధారణంగా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు.. అక్కడే సత్రంలో ఉండి, అక్కడే భోజనం చేస్తుంటారు. అయితే అనంతపురం జిల్లానుంచి వచ్చిన భక్తులు తమతో పాటు తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో వారు అస్వస్థతకు గురయ్యారని అంటున్నారు. వైద్య సిబ్బంది ఫుడ్ పాయిజనింగ్ జరిగిందేమోనని అనుమానిస్తున్నారు. అటు ఉన్నతాధికారులు కూడా భక్తుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కోలుకున్న వెంటనే వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పూట భక్తుల అవస్థలు చూసి వెంటనే ఆలయ సిబ్బంది స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానిక నాయకులు కూడా వారిని పరామర్శించేందుకు ఆస్పత్రికి చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. 


పుర పోరు : నామినేషన్ల ఉపసంహరణ తరువాత అనంతపురం జిల్లా పరిస్థితి ఏంటంటే ?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>