MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mangali-singer-movieb0c5d2c0-9a2c-4d4f-b0c3-32391300ee0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mangali-singer-movieb0c5d2c0-9a2c-4d4f-b0c3-32391300ee0c-415x250-IndiaHerald.jpgమంగ్లీ అనగానే చాలు చిన్న పెద్ద ఆమె పాటలకు మైమరిచి పోతుంటారు. జానపదాలు ఆమె గొంతులో కొత్త హంగులను అద్దుకుంటాయి. మొదట తెలంగాణ పాటలతో మొదలైన ఆమె ప్రస్థానం, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ప్రతి సినిమాలో ఆమె గొంతు వినిపించాల్సిందే.. ఈమె పాడిన ఎన్నో పాటలలో బతుకమ్మ పాటలతో పాటు" రాములో రాములా, శైలజ రెడ్డి అల్లుడు చూడే, బూమ్ బద్దల్ అలాగే ప్రస్తుతం సాయి పల్లవి తో బాగా ట్రెండ్ అవుతున్న సారంగదరియా పాట వరకూ ఇలా ఎన్నో పాటలు పాడి, ఈమె పాడిన ప్రతి పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది.. mangali,singer movie;shiva;deva;eesha;ramu;vedhika;yogi;kamma;sathyavathi rathod;telangana;adinarayanareddy;kanna lakshminarayana;lord siva;silver;reddy;sai pallavi;mangliమంగ్లీ గురించి మనకు తెలియని విషయాలు ఏంటో తెలుసా..?మంగ్లీ గురించి మనకు తెలియని విషయాలు ఏంటో తెలుసా..?mangali,singer movie;shiva;deva;eesha;ramu;vedhika;yogi;kamma;sathyavathi rathod;telangana;adinarayanareddy;kanna lakshminarayana;lord siva;silver;reddy;sai pallavi;mangliThu, 04 Mar 2021 11:00:00 GMTమంగ్లీ అనగానే చాలు చిన్న పెద్ద  ఆమె పాటలకు మైమరిచి పోతుంటారు. జానపదాలు ఆమె గొంతులో   కొత్త హంగులను అద్దుకుంటాయి. మొదట తెలంగాణ పాటలతో మొదలైన ఆమె ప్రస్థానం, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ప్రతి సినిమాలో ఆమె గొంతు వినిపించాల్సిందే.. ఈమె పాడిన ఎన్నో పాటలలో బతుకమ్మ పాటలతో పాటు" రాములో రాములా, శైలజ రెడ్డి అల్లుడు చూడే, బూమ్ బద్దల్ అలాగే ప్రస్తుతం సాయి పల్లవి తో బాగా ట్రెండ్ అవుతున్న సారంగదరియా పాట వరకూ ఇలా ఎన్నో పాటలు పాడి, ఈమె పాడిన ప్రతి పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది..


అంతే కాకుండా ఫోక్ గీతాల రారాణి గా పేరు తెచ్చుకున్న ఈమె అసలు పేరు సత్యవతి రాథోడ్.. అయితే ఈమె పేరుకన్నా అందరికీ మంగ్లీ గానే తెలుసు. ఇక త్వరలోనే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్తిగా శివుడి పాటలతో అలరించనున్న మంగ్లీ తో ఇటీవల  ఒక ఇంటర్వ్యూ లో జరిగిన ముచ్చట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


యాంకర్: ఈషా ఫౌండేషన్ వారి నుంచి ఆహ్వానం రావడం మీకు ఎలా అనిపించింది..?

మంగ్లీ : ఈషా ఫౌండేషన్ నుంచి పాటలు పాడేందుకు పిలవడంతో నా సంతోషానికి హద్దులు లేవు. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ అన్నీ వదులుకొని అక్కడికి వెళ్లాలనే పట్టుతోనే ఉన్నాను. అక్కడ కేవలం పూర్తిగా శివుడి పాటలు మాత్రమే పాడబోతున్నాను. కేవలం ఒకటి,రెండు కాదు మొత్తం ఐదు పాటలు పాడే అవకాశం వచ్చింది..

యాంకర్ : ఏ ఏ పాటలు పాడనున్నారు..?

మంగ్లీ : 1."అజ్ఞానికేం ఎరుక సద్గురువుల మరుగు "
2. " నా గురుడు నన్నింకా యోగి గమ్మననే యోగి గమ్మననే త్యాగి గమ్మననే"
3. " వెండి కొండలు ఏలేటోడా.. అడ్డ బొట్టు శంకరుడా.. "
4. " సాధు జంగమ ఆది దేవుడా.. శంభో శంకర హర లింగరూపుడా "
5. " హలె హలె హాయిని వెతుకుతున్న దోయి బతుకు నైజం ఎరుగదానిదోయి " అనే పాటలు పాడబోతున్నాను. ఇప్పటివరకూ నేను సద్గురుని కలవలేదు. ప్రపంచ వేదిక మీద మొదటి సారి ఆయన ను కలవబోతున్న అందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది..

యాంకర్: జనం మధ్యలో పాడడానికి.. రికార్డింగ్ స్టూడియో లో పాడడానికి మధ్య వ్యత్యాసం ఏమిటి..?

మంగ్లీ: బయట పాడేవాళ్ళు స్టూడియోలో పాడలేరు.. అదే స్టూడియోలో పాడేవాళ్లు బయట పాడలేరు.. స్టూడియోలో అయితే ఎవరూ ఉండరు.. కానీ జనం మధ్యలో చప్పట్ల మధ్య లో పాడుతుంటే ఆ మజానే వేరు. స్టూడియోలో అయితే మనసు పెట్టి పాడాలి.. అదే జనం మధ్యలో ప్రేక్షకుల ఎంకరేజ్మెంట్ తో పాడే పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి..


యాంకర్ : మీకు ఫోక్ సాంగ్స్  అంటే ఇష్టమా లేదా క్లాసికల్ సాంగ్స్ అంటే ఇష్టమా..?


మంగ్లీ : నాకు ఎక్కువగా ఫోక్ సాంగ్స్ పాడటమంటే ఇష్టం. క్లాసిక్ కూడా నచ్చుతుంది.. అది ఒక ప్రపంచం ఇది ఒక ప్రపంచం. ఫోక్ అనేది జనాల ప్రపంచం. కానీ క్లాసిక్ అనేది కొందరి ప్రపంచం.. కానీ నేను ఎన్ని పాటలు పాడినప్పటికీ చివరికి ఈషా ఫౌండేషన్ ద్వారా శివుడు పాటలు పాడడానికి పిలుపు వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. నా గొంతు దేవుడిచ్చిన వరంగా నేను ఎప్పుడూ ఫీలవుతూనే ఉంటాను..

అంటూ ఇంటర్వ్యూ ద్వారా ఆమె చెప్పుకొచ్చింది.


అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>