MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-to-romance-with-pooja-hegdeae0a3467-5868-42ae-b00c-50b75bc45ef8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-to-romance-with-pooja-hegdeae0a3467-5868-42ae-b00c-50b75bc45ef8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎన్నో ఆశలతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. దాదాపుగా మూడేళ్ళ క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చి దానితో పరాజయాన్ని మూటగట్టుకున్న పవర్ స్టార్, ఆపై రాజకీయాల్లో బిజీ అయ్యారు.pawan kalyan;pooja hegde;pawan;pooja hegde;harish shankar;kalyan;pawan kalyan;ram pothineni;ram talluri;shankar;srinivas;surender reddy;trivikram srinivas;tollywood;cinema;media;remake;heroine;agnyaathavaasi;mythri movie makers;ala vaikunthapurramloo;reddyమేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??pawan kalyan;pooja hegde;pawan;pooja hegde;harish shankar;kalyan;pawan kalyan;ram pothineni;ram talluri;shankar;srinivas;surender reddy;trivikram srinivas;tollywood;cinema;media;remake;heroine;agnyaathavaasi;mythri movie makers;ala vaikunthapurramloo;reddyThu, 04 Mar 2021 15:00:37 GMTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎన్నో ఆశలతో కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. దాదాపుగా మూడేళ్ళ క్రితం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి మూవీ ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చి దానితో పరాజయాన్ని మూటగట్టుకున్న పవర్ స్టార్, ఆపై రాజకీయాల్లో బిజీ అయ్యారు.

ఇక ఇటీవల వకీల్ సాబ్ మూవీ ద్వారా మళ్ళి మూవీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమైన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మొత్తం ఐదు సినిమాలు లైన్లో పెట్టారు. కాగా వాటిలో వకీల్ సాబ్ మూవీ ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా, ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న భారీ పీరియాడికల్ మూవీ, అలానే అయ్యప్పనుం కోషియం రీమేక్, ఈ రెండు సినిమాల షూటింగ్ ప్రస్తుం జరుగుతోంది. కాగా వీటి అనంతరం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా తో పాటు, రామ్ తాళ్లూరి నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరొక సినిమా కూడా చేయనున్నారు పవన్. అయితే వీటిలో సురేందర్ రెడ్డి తో పవన్ చేయబోయే సినిమా మంచి యాక్షన్ తో కూడిన స్టైలిష్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని సమాచారం. 

ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుందని, ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఆయన పాత్రని రాసుకున్నారట సురేందర్ రెడ్డి. అలానే ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ కి సంబంధించి కొద్దిరోజులుగా పలువురు పేర్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నాయి. ఇక లేటెస్ట్ గా అలవైకుంఠపురములో వంటి సూపర్ హిట్ మూవీ తో మరింత క్రేజ్ దక్కించుకున్న పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆమెతో దర్శకుడు సురేందర్ రెడ్డి సంప్రదింపులు జరిపి డేట్స్ కూడా తీసుకున్నారని, దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు....!!



జగన్ ను వీళ్ళే నాశనం చేసేస్తారు గురూ...!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>