PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pollution-aircf461f3f-1680-4b16-a261-4c13fc393f26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pollution-aircf461f3f-1680-4b16-a261-4c13fc393f26-415x250-IndiaHerald.jpgపెరిగిన సౌకర్యాలతో అంతా కాలుష్యమం అయిన రోజులు ఇవి. పర్యావరణం అంటే పట్టకుండా.. ఎంతవరకూ మన సౌఖ్యం మనం చూసుకుంటూ ప్రకృతిని దారుణంగా దెబ్బ తీస్తున్నాం. అయితే దీని ఫలితాలు కూడా మనమే అనుభవిస్తున్నాయి. రాబోయే తరాలు మరింతగా బాధపడేలా ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్నాం. మన చర్యల కారణంగా గాలి ఎంతగా కలుషితం అయ్యిందో తెలుస్తే గుండెలు అదరడం ఖాయం. దేశవ్యాప్తంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పెద్దయెత్తున పేరుకుపోవడంవల్ల జరుగుతున్న అనర్థాల తీవ్రత చాలా ఎక్కువ. భూమి మీద ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకదానికి కలుషిత వాయువే కారణమpollution-air;mumbai;january;2020;air;central governmentబాబోయ్.. మనం ఎంత విషపు గాలి పీలుస్తున్నామో తెలుసా..?బాబోయ్.. మనం ఎంత విషపు గాలి పీలుస్తున్నామో తెలుసా..?pollution-air;mumbai;january;2020;air;central governmentThu, 04 Mar 2021 08:00:00 GMTగాలి ఎంతగా కలుషితం అయ్యిందో తెలుస్తే గుండెలు అదరడం ఖాయం. దేశవ్యాప్తంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పెద్దయెత్తున పేరుకుపోవడంవల్ల జరుగుతున్న అనర్థాల తీవ్రత చాలా ఎక్కువ.

భూమి మీద ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకదానికి కలుషిత వాయువే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. సగటున సుమారు అయిదేళ్లదాకా పౌరుల ఆయుర్దాయాన్నీ కాలుష్యం కాటు వేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిధికి 10, 11 రెట్ల మేర సూక్ష్మ ధూళి కణాలు గాలిని కలుషితం చేస్తున్నాం. కాలుష్య తీవ్రతను వివరించే కొన్ని గణాంకాలు ఇప్పుడు చూద్దాం..  2020 అక్టోబరు నుంచి మొన్న జనవరి చివరి వరకు సూక్ష్మ ధూళి కణాలు అంతకు సంవత్సరం క్రితంతో పోలిస్తే మరింత పెరిగాయి. సీఎస్‌ఈ తాజా విశ్లేషణ చెప్పిన వాస్తవం ఇది.

ఇక  కేంద్ర కాలుష్య మండలి అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదైన సమాచారం ఆధారంగా పరిశీలించిన 99 నగరాల్లో 43చోట్ల పరిస్థితి దిగజారింది. ఆ జాబితాలో గురుగ్రామ్‌, లఖ్‌నవూ, జైపూర్‌, ఆగ్రా, నవీ ముంబయి, జోధ్‌పూర్‌, కోల్‌కతాలతోపాటు విశాఖపట్నం పేరూ ఉంది. ఔరంగాబాద్‌, ఇండోర్‌, భోపాల్‌, కొచ్చి, కోజికోడ్‌ తదితరాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు కాలుష్య స్థాయి భారీగా పెరిగిందట.


ఇక దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగేకొద్దీ అయిదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత ముప్పు పెరుగుతోందట. దేశంలోని పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం పెరుగుతున్న సమయంలోనే గాలి నాణ్యత మెరుగుదల కోసం నిధుల కేటాయింపులు ఇటీవలి కేంద్ర బడ్జెట్లో తగ్గిపోవడం విశేషం. దీర్ఘకాలం వాయు కాలుష్యానికి గురైనవారి మెదడు పనితీరు దెబ్బతిని, మూత్రపిండాల సామర్థ్యమూ తగ్గిపోతోందట. వాయునాణ్యత క్షీణించి శ్వాసకోశ వ్యాధులూ పెరుగుతున్నాయట. మరి ఇకనైనా మేలుకుందామా.. వద్దా..?




వావ్.. ఈ నదిని ఒక్కసారైనా చూడాల్సిందే బాసూ..!

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>