PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijasaireddy-gantafb03fe28-b804-410f-b059-59c53d046b61-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijasaireddy-gantafb03fe28-b804-410f-b059-59c53d046b61-415x250-IndiaHerald.jpgవిజయసాయిరెడ్డి.. వైసీపీలో ఎంత పవర్‌పుల్లో అందరికీ తెలుసు. ఒక విధంగా పార్టీకి ఆయన ఆయువుపట్టు.. పార్టీకి సంబంధించిన కీలక విషయాలను ఆయన చక్కబెడతారు. అన్నీ బాగానే ఉన్నా.. విజయసాయిరెడ్డి కాస్త అహంకారం కూడా ఎక్కువన్న సంగతి తెలిసిందే. దాని ఫలితంగానే ఆయన కాస్త ఘాటుగానే ఎవరిపైనైనా స్పందిస్తారు. తాజాగా ఆయన విశాఖ పట్నంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ని‌న్న ఉదయం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస్ ప్రధాన అనుచ‌రుడు కాశీ విశ్వనాథ్ వైయ‌స్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కారvijasaireddy-ganta;thirtha;jagan;geum;mp;vishakapatnam;government;mla;tdp;kasi;partyవిజయసాయి రెడ్డికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గంటా..? పరువు పోయిందిగా..?విజయసాయి రెడ్డికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన గంటా..? పరువు పోయిందిగా..?vijasaireddy-ganta;thirtha;jagan;geum;mp;vishakapatnam;government;mla;tdp;kasi;partyThu, 04 Mar 2021 07:00:00 GMTవిశాఖ పట్నంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ని‌న్న ఉదయం టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస్ ప్రధాన అనుచ‌రుడు కాశీ విశ్వనాథ్ వైయ‌స్ఆర్‌సీపీ  తీర్థం పుచ్చుకున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి విజ‌య సాయిరెడ్డి స‌మ‌క్షంలో కాశీ విశ్వనాథ్ పార్టీలో చేరారు.

రాష్ట్రంలో సుప‌రిపాల‌న చూసి కాశీ విశ్వనాథ్ వైయ‌స్ఆర్‌సీపీలో చేరార‌ని విజ‌యసాయిరెడ్డి తెలిపారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 90 శాతం ప్రజ‌లు వైయ‌స్ఆర్‌సీపీకి ప‌ట్టం క‌ట్టార‌ని చెప్పారు. జీవీఎంసీ ఎన్నిక‌ల్లో విజ‌యం  ‌సాధిస్తామ‌ని ఆయ‌న ధీమా వ్యక్తం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఇదే వేదికపై విజయసాయిరెడ్డి మరో సంచలన ప్రకటన చేశారు. కాశీ విశ్వనాథే కాదు.. గంటా శ్రీనివాసరావు కూడా త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారంటూ షాకింగ్ ప్రకటన చేశారు. ఈ మేరకు గతంలో గంటా శ్రీనివాసరావు జగన్ కు ప్రతిపాదనలు పంపారని విజయసాయిరెడ్డి అన్నారు.

సీఎం జగన్ అనుమతి తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీలో చేరతారని విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం ఖాయమైపోయందని అంతా అనుకున్నారు. కానీ.. సాయంత్రానికి ఈ అంశంపై గంటా శ్రీనివాసరావు స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు గతంలోనూ చాలా సార్లు ప్రచారం జరిగిందని.. కానీ ఇవేమీ నిజం కాదని కుండబద్దలు కొట్టేశారు. పార్టీ మార్పు ప్రచారాన్ని ఇప్పటికీ ఖండిస్తూనే ఉన్నానని ఆయన అన్నారు. మరి విజయసాయిరెడ్డి ఏ లక్ష్యంతో మాట్లాడారో అర్థం కావడం లేదన్న గంటా.. తాను ఎలాంటి ప్రతిపాదనలు పంపానో విజయసాయిరెడ్డే  చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు.

గంటా అనూహ్యంగా ఎదురుదాడి చేయడంతో విజయసాయిరెడ్డి డిఫెన్సులో పడిపోయారు. గంటా స్పందనపై ఎంపీ విజయసాయిరెడ్డి  మరోసారి స్పందించారు. వైసీపీలో చేరతానని గంటా గతంలో ప్రతిపాదన పంపిన మాట నిజమేనని.. గంటా ప్రతిపాదనపై సీఎం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పునరుద్ఘాటించారు. మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం మా పార్టీకి లేదన్న విజయసాయిరెడ్డి.. గంటా వచ్చినంత మాత్రాన ప్రభుత్వంలో మార్పులు ఉండవని ముక్తాయించారు.




ఆ జిల్లా నేతలను రిక్వస్ట్ చేస్తున్న బాబు...?

పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>