Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlibdbbe248-7f9a-4847-973e-699188b09114-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/virat-kohlibdbbe248-7f9a-4847-973e-699188b09114-415x250-IndiaHerald.jpgటీమిండియాకు ఇన్నాళ్లుగా తాను కెప్టెన్‌గా కొనసాగడాన్ని నమ్మలేకపోతున్నానంటూ విరాట్ కోహ్లీ అన్నాడు. టెస్టుల్లో తన కెప్టెన్సీలో మంచి ఫలితాలు సాధించామని, అది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని, జట్టు సమష్ఠిగా కృష్టి చేయడం వల్లనే..virat kohli;virat kohli;narendra modi;chennai;yuva;narendra‘ఇంతకాలం కెప్టెన్‌గా ఉన్నానా..’ కోహ్లీనే నమ్మలేకపోతున్నా‘ఇంతకాలం కెప్టెన్‌గా ఉన్నానా..’ కోహ్లీనే నమ్మలేకపోతున్నాvirat kohli;virat kohli;narendra modi;chennai;yuva;narendraThu, 04 Mar 2021 18:49:24 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియాకు ఇన్నాళ్లుగా తాను కెప్టెన్‌గా కొనసాగడాన్ని నమ్మలేకపోతున్నానంటూ విరాట్ కోహ్లీ అన్నాడు. టెస్టుల్లో తన కెప్టెన్సీలో మంచి ఫలితాలు సాధించామని, అది తనకు చాలా ఆనందాన్నిచ్చిందని, జట్టు సమష్ఠిగా కృష్టి చేయడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పాడు. భారత జట్టులో చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారని, వాళ్లంతా తన దృష్టిని ఆకర్షించారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తూ జట్టు అంచనాలను అందుకోవడం గొప్ప అంశమని అన్నాడు.

అత్యధిక టెస్టులకు సారథ్యం వహించిన టీమిండియా కెప్టెన్‌గా ఇన్నాళ్లూ మహేంద్రసింగ్‌ ధోనీ(60 మ్యాచ్‌లు) పేరున ఉన్న రికార్డును విరాట్‌ కోహ్లీ సమం చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు.. కోహ్లీ కెరీర్‌లో కెప్టెన్‌గా 60వ మ్యాచ్‌.

దీంతో విరాట్‌ కోహ్లీ ధోనీ రికార్డును సమం చేసినట్లైంది. ఇక గతవారం పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో స్వదేశంలో అత్యధిక టెస్టు విజయాలు(22) సాధించిన కెప్టెన్‌గానూ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఎంఎస్ ధోనీ(21)పేరిట ఉండేది.

ఇదిలా ఉంటే ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయినా.. ఆ తరువాత అదే మైదానంలో జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇక ఇటీవల మొతేరా స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పనిపట్టారు.
   
కేవలం 2 రోజుల్లోనే మ్యాచ్ కైవసం చేసుకున్నారు. ఇక నేటి నుంచి మొదలైన నాలుగో టెస్టులో కూడా గెలిచి గొప్పగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని టీమిండియా భావిస్తోంది. అయితే మ్యాచ్ డ్రా అయినా టీమిండియా ఫైనల్‌కు చేరుతుంది. కాగా.. ఈ టెస్టులోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.


సలార్ సినిమా కు భారీ OTT ఆఫర్.. ఇండియా లోనే ఏ చిత్రానికి..?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>