PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nandamuri-balayya-on-duty5283c307-21d0-41df-bf66-535c59a292ab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nandamuri-balayya-on-duty5283c307-21d0-41df-bf66-535c59a292ab-415x250-IndiaHerald.jpgమార్చి 10 వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో ఎవరికి వారు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్న గ్రామపంచాయతీల్లో మెజారిటీ పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ అలర్ట్ అయ్యారు. హిందూపురం మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరుగుతుండటంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావించి ప్రచారం నిర్వహించేందుకు బాలయ్య సిద్దం అయ్యారు. ఈరోజు నుంచి హిందూపురం మjagan nimmagadda elections;ntr;balakrishna;nischal;vishwa;panchayati;mla;fort;tdp;ycp;nandamuri taraka rama rao;march;petta;partyపుర పోరు : బాలయ్య ఆన్ డ్యూటీ..పుర పోరు : బాలయ్య ఆన్ డ్యూటీ..jagan nimmagadda elections;ntr;balakrishna;nischal;vishwa;panchayati;mla;fort;tdp;ycp;nandamuri taraka rama rao;march;petta;partyThu, 04 Mar 2021 14:00:00 GMTమార్చి 10 వ తేదీన ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకోవడంతో ఎవరికి వారు గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉన్న గ్రామపంచాయతీల్లో మెజారిటీ పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే బాలకృష్ణ అలర్ట్ అయ్యారు.  హిందూపురం మున్సిపాలిటీ కూడా ఎన్నికలు జరుగుతుండటంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని భావించి ప్రచారం నిర్వహించేందుకు బాలయ్య సిద్దం అయ్యారు. 

ఈరోజు నుంచి హిందూపురం మున్సిపాలిటీలో బాలకృష్ణ ప్రచారం చేయడానికి సిద్ధం అయ్యారు.  మోత్కుపల్లి, విద్యానగర్, బోయ పేట, నింకంపల్లి, మేలపురం, విజయనగర్ కాలనీ, ముదిరెడ్డిపల్లి, సింగిరెడ్డి పల్లి ప్రాంతాల్లో బాలకృష్ణ మొదటిరోజు ప్రచారం చేయబోతున్నారు. నిజానికి  హిందూపురం అంటే టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి ఎరుగని ప్రాంతం. అంతకు మించి అంటే నందమూరి ఫ్యామిలీ అడ్డా. అప్పటి ఎన్టీఆర్ నుంచి నేటి బాలయ్య వరకు నందమూరి ఫ్యామిలీని ఆదరిస్తున్నారు. కానీ మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాత్రం టీడీపీకి కోలుకోలేని రిజల్ట్స్ వచ్చాయి. 

అందుకే బాలయ్య లైన్ లోకి వచ్చారు. హిందూపురం మునిసిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. గత ఎన్నికల్లో 19 స్థానాల్లో టీడీపీ, 19 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అప్పట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓట్లతో చైర్మన్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. గతంలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. దీంతో ఈసారి కూడా గెలిచి చైర్మన్ స్థానాన్ని సంపాదించడానికి వైసీపీకి బలంగా ఉన్న 19 వార్డులను ఎంచుకుని ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీ బలంగా ఉన్నా ఎమ్మెల్సీ ఇక్బాల్, నవీన్ నిశ్చల్ మధ్య విబేధాలతో దానిని అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు.




పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?

అభిమానులకు శుభవార్త చెప్పిన ప్రముఖ గాయని.. త్వరలోనే తల్లి కాబోతోందట..!!

తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>