PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/they-all-shook-hands-and-stood-upf46e4ee5-e9c8-43d1-8117-a319dae2872c-415x250-IndiaHerald.jpgఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే నాయకత్వం కనబడటంలేదు. తెలంగాణలో ఈ సమస్య చాలా వరకు తీవ్రంగానే ఉందనే చెప్పాలి. ఒక రేవంత్ రెడ్డి మినహా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు ఎవరు లేరు అనే విషయం చెప్పాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కాస్త ప్రజల్లోకి బలంగా వెళుతూ ఉంటారు. అలాగే శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రజల్లోకి వెళ్తునే ఉంటారు. అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేసcongress,ts;bhavana;revanth;bharatiya janata party;revanth reddy;congress;mp;mallu bhatti vikramarka;reddy;partyతెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?తెలంగాణా కాంగ్రెస్ కు శుభవార్త...? ఆమె మళ్ళీ వస్తున్నారా...?congress,ts;bhavana;revanth;bharatiya janata party;revanth reddy;congress;mp;mallu bhatti vikramarka;reddy;partyThu, 04 Mar 2021 13:03:49 GMTకాంగ్రెస్ పార్టీలో కొన్ని సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రధానంగా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడే నాయకత్వం కనబడటంలేదు. తెలంగాణలో ఈ సమస్య చాలా వరకు తీవ్రంగానే ఉందనే చెప్పాలి. ఒక రేవంత్ రెడ్డి మినహా ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులు ఎవరు లేరు అనే విషయం చెప్పాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా కాస్త ప్రజల్లోకి బలంగా వెళుతూ ఉంటారు. అలాగే శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రజల్లోకి వెళ్తునే ఉంటారు. అలాగే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు మాత్రం కొన్ని సమస్యలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బాగా వెంటాడుతున్నాయి. మహిళా నాయకత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా లేదు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో పెద్దగా దృష్టి సారించలేకపోతుంది అనే ఆవేదన కూడా ఉంది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అరుణను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారని సమాచారం. రేవంత్ రెడ్డితో ఆమెకు ముందు నుంచి కూడా విభేదాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు వీళ్ళ ఇద్దరిమధ్య సమస్యలను పరిష్కరించి డీకే అరుణ తెలంగాణలో కనుక ముందుకు తీసుకు రాగలిగితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది పార్టీకి కూడా కలిసి వస్తుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు డీకే అరుణ భారతీయ జనతా పార్టీ లో మంచి ప్రాధాన్యత తో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు కూడా చూసే అవకాశాలు ఉండవచ్చు. తెలంగాణలో భారతీయ జనతాపార్టీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు.


గంటా..మంట. తంటా...?

పుర పోరు : అనంతలో ఎక్కడా తగ్గని టీడీపీ.. వైసీపీకి గట్టి పోటీ !

నిమ్మగడ్డ అది కూడా పూర్తి చేస్తారా.. ?

ఏపీలో ఆ నలుగురు మంత్రులదే రాజ్యం... బాలయ్య సంచలన వ్యాఖ్యలు

వైరల్ :కేవలం 20 చెట్లతో 36 లక్షలు సంపాదన..?

అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>