MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanta016e9d90-8895-451e-8b83-28b359c678b9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samanta016e9d90-8895-451e-8b83-28b359c678b9-415x250-IndiaHerald.jpgసమంత. గ్లామర్ విత్ టాలెంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. ఏ మాయ చేశావో అన్న సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సమంతా ఆ తరువాత తెలుగు సినిమానే మాయ చేశారు. ఫ్యాన్స్ ని పెద్ద ఎత్తున కూడగట్టుకున్నారు. సమంతా హీరోయిన్ గా అగ్ర నాయకుల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె అన్ని సినిమాలూ ఒక ఎత్తు రంగస్థలం మూవీ మరో ఎత్తు అని చెప్పాలి. samanta;gunasekhar;maya;naga;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;telugu;naga aswin;tamil;director;heroineసమంత ఆఖరి మూవీ అదేనా...?సమంత ఆఖరి మూవీ అదేనా...?samanta;gunasekhar;maya;naga;nageshwara rao akkineni;samantha;tollywood;cinema;telugu;naga aswin;tamil;director;heroineThu, 04 Mar 2021 19:30:00 GMTహీరోయిన్ అని చెప్పాలి. ఏ మాయ చేశావో అన్న సినిమా ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సమంతా ఆ తరువాత తెలుగు సినిమానే మాయ చేశారు. ఫ్యాన్స్ ని పెద్ద ఎత్తున కూడగట్టుకున్నారు. సమంతా హీరోయిన్ గా అగ్ర నాయకుల సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఆమె అన్ని సినిమాలూ ఒక ఎత్తు రంగస్థలం మూవీ మరో ఎత్తు అని చెప్పాలి.

మూవీ విషయం చెప్పాలంటే సమంత గ్లామర్ తో పాటు టాలెంట్ కూడా పోటీ పడింది. అంత పెద్ద హిట్ కావడం వెనక సమంత పాత్ర కూడా ఉందని చెప్పాలి. ఇక సమంతా చేసిన చాలా సినిమాల్లో  ఆమె పాత్రలే గుర్తుకు వస్తాయి అంటే ఆమె నటనా ప్రతిభ ఏంటో అర్ధమయ్యే ఉంటుంది. ఇక సమంత 2017లో అక్కినేని వారి వారసుడి నాగ చైతన్యను వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరి జంట చూడ ముచ్చటగా ఉంటుందన్నది తెలిసిందే.

ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ అన్న తేడా లేకుండా ఈ ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారు. ఇక సమంత పెళ్ళి అయిన తరువాత కూడా వరసగా సినిమాలూ చేసుకుంటూ వెళ్ళారు. దానికి చైతూ కూడా ప్రొసీడ్ అనేశారు. అయితే ఇపుడు సమంత ఒక షాకింగ్ డెసిషన్ ని తీసుకుంది అంటున్నారు. అదేంటి అంటే ఇక మీదట తన వ్యక్తిగత జీవితానికే ఎక్కువ టైమ్ ఇవ్వాలని. అంటే సినిమాలను వదులుకోవాలని.

మొత్తానికి ఫ్యాన్స్ కి చెప్పే చేదు వార్త ఏంటి అంటే సమంత ఇకపైన సినిమాల్లో కనిపించదు. ఆమె ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు తప్ప మరేవీ అంగీకరించడంలేదుట. ఆమె లేటెస్ట్ గా కమిట్ అయిన మూవీ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్ష‌న్ లో శాకుంతలం మూవీ. ఈ మూవీ తో పాటు తమిళ్ లో మరో మూవీకి సమంత సైన్ చేసింది అని అంటున్నారు. ఈ మూవీస్ రెండూ పూర్తి చేస్తే ఇక సమంతా నటించడానికి గుడ్ బై కొట్టేస్తుందిట. అదే విధంగా సమంతా ఆఖరి సినిమా తెలుగులో చెప్పాలంటే శాకుంతలమే అంటున్నారు. అదే నిజమైతే బాధాకరమే మరి.




సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా కొత్త వ్యక్తి!

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>