PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-behind-sasikala-political-statement-target-dmk53722c92-f25f-4360-a034-3aa9af9b99b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjp-behind-sasikala-political-statement-target-dmk53722c92-f25f-4360-a034-3aa9af9b99b5-415x250-IndiaHerald.jpgశశికళ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ప్రస్తుతం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావిsasikala tamilnadu;view;modi;amit shah;udhayanidhi stalin;bharatiya janata party;amith shah;tamil;assembly;tamilnadu;stalinబీజేపీ అలా నరుక్కొస్తొందా!బీజేపీ అలా నరుక్కొస్తొందా!sasikala tamilnadu;view;modi;amit shah;udhayanidhi stalin;bharatiya janata party;amith shah;tamil;assembly;tamilnadu;stalinThu, 04 Mar 2021 09:04:31 GMTబీజేపీ అధికారంలో ఉంది. తాము ఇంతవరకు పాగ వేయని ప్రాంతాల్లోనూ బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా దక్షిణాదిలో తమ పట్టు సాధించేందుకు కమలనాధులు ఎత్తులు వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు, కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలపైనా స్పెషల్ ఫోకస్ చేసింది మోడీ, అమిత్ షా ద్వయం.

  అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తమిళనాడులో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకేకు షాకిస్తుందని భావించిన శశికళ.. సడెన్ గా సంచలన ప్రకటన చేశారు.  రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ రాజకీయాలను మరో మలుపు తిప్పుతారని భావిస్తున్న చిన్నమ్మ.. అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని  చెప్పడం ఇప్పుడు చర్చగా మారింది.

 అయితే శశికళ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి.

గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే శశికళతో డీల్ కుదిరిపోయిందని తమిళనాడు నెటిజన్లు సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ఎన్డీయే నేతృత్వంలో అన్నాడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న బీజేపీ, ఆ మేరకు ప్రస్తుతానికి ఇలా ప్లాన్ చేసిందని తెలుస్తోంది.మరోవైపు డీఎంకే మాత్రం శశకళ నిర్ణయంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్నిఆపలేరని ప్రకటించారు స్టాలిన్.


పుర పోరు: ఆ కార్పొరేష‌న్లో పోటీ చేయ‌కుండా ఓడిపోయిన టీడీపీ

ఎడిటోరియల్: ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీయే కాబోయే భారత ప్రధాని అంటున్నారు! నిజమేనా?

బ్రేకింగ్‌: 12 మున్సిపాల్టీలు, 3 కార్పొరేష‌న్లు వైసీపీ ఖాతాలోకే..

జ‌గ‌న్‌తో క‌ల‌వాల‌ని జ‌న‌సేన‌కు బీజేపీ డైరెక్ష‌న్ ?

పుర పోరు: ఆ మూడు చోట్లా ఎన్నిక‌ల‌కు ముందే వైసీపీ స్వీప్‌

హెరాల్డ్ సెటైర్ : అభ్యర్ధులను కాపాడుకోవటం కోసం ఇన్ని అవస్తలా ?

తెలుగు సినీ లవర్స్ కి పండగే.. ఈ వారంలో ఏకంగా 11 సినిమాలు రిలీజ్.. !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>