MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hasan1f453f99-4f4d-4dfc-a8dc-d82aaedcfe69-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shruthi-hasan1f453f99-4f4d-4dfc-a8dc-d82aaedcfe69-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణకు ఇప్పుడు హీరోయిన్స్ టెన్షన్ పట్టుకుంది. ఆయన సినిమాలలో హీరోయిన్స్ ని ఫైనల్ చేయడానికి దర్శక నిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన నటింపజేసేందుకు హీరోయిన్ ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ అయితే షూటింగ్ మొదలుపెట్టాక తాము చేయలేము అని తప్పుకున్నారు. దానికి కారణం ఏమిటి అనేది తెలియక పోయినా ఎట్టకేలకు బాలయ్య సరసన నటించేంshruthi hasan;prabhas;balakrishna;gopichand;shruti;shruti haasan;boyapati srinu;pragya jaiswal;prasanth;prashanth neel;sruthi;cinema;telugu;heroine;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;yashasvi jaiswal;krackబాలయ్యకి షాక్ ఇచ్చిన శృతి హాసన్ ?బాలయ్యకి షాక్ ఇచ్చిన శృతి హాసన్ ?shruthi hasan;prabhas;balakrishna;gopichand;shruti;shruti haasan;boyapati srinu;pragya jaiswal;prasanth;prashanth neel;sruthi;cinema;telugu;heroine;mythri movie makers;prasanth neel;nandamuri taraka rama rao;prashant kishor;yashasvi jaiswal;krackThu, 04 Mar 2021 11:00:00 GMTనందమూరి బాలకృష్ణకు ఇప్పుడు హీరోయిన్స్ టెన్షన్ పట్టుకుంది. ఆయన సినిమాలలో హీరోయిన్స్ ని ఫైనల్ చేయడానికి దర్శక నిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య సరసన నటింపజేసేందుకు హీరోయిన్ ఎంపిక చేయడానికి దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ అయితే షూటింగ్ మొదలుపెట్టాక తాము చేయలేము అని తప్పుకున్నారు. దానికి కారణం ఏమిటి అనేది తెలియక పోయినా ఎట్టకేలకు బాలయ్య సరసన నటించేందుకు ప్రగ్యా జైస్వాల్ ఫైనల్ అయింది. ఆమె హీరోయిన్ గా ఇప్పటికే షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.. 

ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక చేయడం కూడా ఇప్పుడు దర్శకుడికి తలనొప్పిగా మారిందని అంటున్నారు.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని శృతిహాసన్ ను దర్శకుడు కోరారట. శృతిహాసన్ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆయనే స్వయంగా క్రాక్ సినిమాలో అవకాశం ఇచ్చి ఆమెను ప్రోత్సహించారు. తాను అడిగితే కచ్చితంగా సినిమా ఒప్పుకుంటుందని భావించి ఆమెను అప్రోచ్ అయ్యారు దర్శకుడు గోపీచంద్ మలినేని. అయితే ఇవేవీ పట్టించుకోని శృతిహాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించలేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. 

దానికి స్పష్టంగా కారణాలు ఏమీ చెప్పకపోయినా ఆమె ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా నటించడమే కారణమని తెలుస్తోంది. ఆమె ప్రభాస్ సరసన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది, అలాంటిది ఇప్పుడు బాలయ్య సరసన నటిస్తే తనకు ఫ్యూచర్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావించి ఆమె ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు దర్శకనిర్మాతలు బాలయ్య సరసన నటించే మరో హీరోయిన్ కోసం వెతుకులాటలో పడ్డారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.




అప్పులకుప్ప ఆంద్రప్రదేశ్ - ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరం

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>