MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/david-warner01435e83-279f-4e14-8ec8-d7d74c2e8b2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/david-warner01435e83-279f-4e14-8ec8-d7d74c2e8b2f-415x250-IndiaHerald.jpgఆసీస్‌ స్టార్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఆయన హవానే కొనసాగుతుంది. ఇక ఆయనను డేవిడ్‌ వార్నర్ అని పిలవడం కన్న.. టిక్‌టాక్‌ స్టార్‌ అని పిలుస్తే అందరికి టక్కున గుర్తుకు వస్తుందేమో. ఎందుకంటే.. వార్నర్‌.. చేసే ఫేస్‌ మార్ఫింగ్‌ వీడియోలకు అలాంటి క్రేజ్‌ ఉంది మరి.david warner;vijay;cricket;cinema;tamil;tik tok;hindi;hero;joseph vijay;dalapathi;masterడేవిడ్ వార్నర్ ఈసారి ఎవరి గెటప్ వేశాడో తెలుసా..!?డేవిడ్ వార్నర్ ఈసారి ఎవరి గెటప్ వేశాడో తెలుసా..!?david warner;vijay;cricket;cinema;tamil;tik tok;hindi;hero;joseph vijay;dalapathi;masterThu, 04 Mar 2021 10:00:00 GMTటిక్‌టాక్‌ స్టార్‌ అని పిలుస్తే అందరికి టక్కున గుర్తుకు వస్తుందేమో. ఎందుకంటే.. వార్నర్‌.. చేసే ఫేస్‌ మార్ఫింగ్‌ వీడియోలకు అలాంటి క్రేజ్‌ ఉంది మరి. అయితే తెలుగు, తమిళ్‌, హింది అన్న తేడా లేకుండా.. వీడియోలతో ఎప్పుడూ ఎంటర్‌టైన్‌ చేస్తుంటాడు వార్నర్‌.

ఇప్పుడు తాజాగా రజనీకాంత్‌ స్టైల్‌ ఇరదీశాడు. అంతేకాదు.. తలైవాకు సంబంధించిన పలు సినిమాలోని డైలాగ్‌లను.. కూడా వార్నర్‌ పలికించాడు. ఇక బాలీవుడ్‌ బడా హీరోల నుంచి మొదలు పెడితే.. టాలీవుడ్‌ వరకు హీరోల మొహాల స్థానంలో తన ఫేస్‌ను సెట్‌ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వస్తున్నాడు ఆయన. రీఫేస్‌ యాప్‌ సహాయంతో అమితాబ్‌, ప్రభాస్‌, మహేష్‌బాబు, రజనీకాంత్‌ వంటి హీరోల సన్నివేశాలకు తన మొహాన్ని యాడ్ చేసి పోస్ట్‌ చేసిన వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ క్రికెటర్ దళపతి ఫ్యాన్స్‏ను అలరిస్తున్నాడు. ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన సినిమా ‘మాస్టర్’ బాక్సాఫీసు దగ్గర సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవల వరుసగా తెలుగు హీరోల సినిమాలను రీఫేస్ చేస్తూ వస్తున్న వార్నర్ తాజాగా విజయ్ నటించిన మాస్టర్ సినిమాను రీఫేస్ చేసి.. తన ఇన్ స్టాలో షేర్ చేశాడు. దీంతో వార్నర్ ‌కు క్రికెట్ ఏమో తెలియదు కానీ ఈ వీడియోల ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ వస్తోందనే చెప్పాలి మరి. అంతేకాకుండా ఎంతోమంది తన అభిమానులుగా మారిపోతున్నారు. బుట్టుబొమ్మ నుంచి మొదలుపెడితే ఇప్పటి రజనీ స్టైల్ వరకు అన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారుతున్నాయి. మొత్తానికి వార్నర్ క్రికెట్ కంటే ఈ సంబరాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు.


పుర పోరు: చిత్తూరు, కడపలో ఏకగ్రీవాల వివరాలు ఇవే..!

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?

ఆ ఎమ్మెల్యే మ‌నిషిగా వైసీపీలో.. మ‌న‌సంతా టీడీపీలో ?

పుర పోరు: గుంటూరులో రెండు మున్సిపాల్టీల్లో వైసీపీ స్వీప్‌... టీడీపీకి గుండు సున్నా




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>