KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children400573d5-f553-4dcb-b8b0-cef376fef0d2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children400573d5-f553-4dcb-b8b0-cef376fef0d2-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాల మంది పిల్లలు ఫోన్ కి అలవాటు పడ్డారు. ఇక వాళ్ళు అన్నం తినాలి అన్నకూడా వారి ముందు ఫోన్ ఉండాల్సిందే. అయితే చిన్న పిల్లలు ఫోన్ వాడటం వలన మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా మొబైల్ వరల్డ్ లో విహరించే పిల్లలకు చదువు చెప్పటం అంటే అతిపెద్ద ఛాలెంజ్. వీరికి జనరల్ టీచింగ్ మెథడాలజీ అస్సలు సెట్ కాదు. children;prakruti;audi;smart phone;balloonబుడుగు: మీ పిల్లలకి తర్వగా ఫోన్ అలవాటు మార్పించండి.. లేదంటే ప్రమాదమే..!?బుడుగు: మీ పిల్లలకి తర్వగా ఫోన్ అలవాటు మార్పించండి.. లేదంటే ప్రమాదమే..!?children;prakruti;audi;smart phone;balloonThu, 04 Mar 2021 17:00:00 GMTఫోన్ కి అలవాటు పడ్డారు. ఇక వాళ్ళు అన్నం తినాలి అన్నకూడా వారి ముందు ఫోన్ ఉండాల్సిందే. అయితే చిన్న పిల్లలు ఫోన్ వాడటం వలన మంచిది కాదని వైద్య నిపుణులు  హెచ్చరిస్తున్నారు. ఇలా మొబైల్ వరల్డ్ లో విహరించే పిల్లలకు చదువు చెప్పటం అంటే అతిపెద్ద ఛాలెంజ్. వీరికి జనరల్ టీచింగ్ మెథడాలజీ అస్సలు సెట్ కాదు. ఇలాంటి చిన్నారులకు చదువు చెప్పేవారు ముందు అప్ గ్రేడ్ అవ్వాలి.. ఎందుకంటే వీరు ఏ విషయంపై శ్రద్ధ చూపి, ఫోకస్ పెట్టరు. వీరి దృష్టి ఎప్పుడూ ఏదోదానిపై ఉంటుంది కానీ మీరు చెబుతున్న విషయంపై అస్సలు ఉండదు. కాబట్టి వీరికి న్యూ ఎడ్యుకేషన్ మెటీరియల్ అవసరం అవుతుంది.

ఇక  మొబైల్ కు బానిస కాని పిల్లలు చెట్లు, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, సముద్రాలు, నదులు అన్నీ ఎంతో ఉత్సాహంగా, లోతుగా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదే ఇంటర్నెట్ కు అడిక్ట్ అయిన పిల్లలైతే వీటిని అస్సలు ఇష్టపడరు, వీటి లోతుపాతులను అస్సలు చూడకపోగా ప్రకృతి అందాలను వీరు ఏమాత్రం ఎంజాయ్ చేయలేరు. పిల్లల బుర్ర ఇంకా పూర్తిగా వికసించని ముక్కపచ్చలారని బాల్యంలో మొబైల్ వారిని అనలిటికల్ స్కిల్స్ కు దూరంగా జరిగేలా దుష్ప్రభావం చూపుతుంది.

అయితే మొబైల్ అంటే పంచప్రాణాలుగా భావించే చిన్నారులు ఈ సైడ్ ఎఫెక్ట్ నుంచి అస్సలు తప్పించుకోలేరు. అందుకే భవిష్యత్ తరాల్లో కేవలం సైంటిస్టులు, ఇంజినీర్లు వంటి ప్రొఫెషనల్స్ తప్ప మిగతా కళాకారులు అనేవారే ఉండరేమో అని మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. డిజిటల్ గేమ్స్ ఆడే పిల్లలకు వర్చువల్ వరల్డ్ తప్ప వేరేది ఏదీ వారికి అందంగా కనిపించదు, వారిని ఆకట్టుకోదు. మన ఎగ్జిబిషన్లలో ఉండే బెలూన్ షూటింగ్ వంటి గేమ్స్ ను ఒకసారి వారితో ఆడించండి, మొబైల్ కు అతుక్కుపోయే బాలబాలికలు ఏమాత్రం గురిచూసి బెలూన్లను షూట్ చేయలేరు. అదే సంప్రదాయ ఆటలు ఆడుకునే పిల్లలైతే నాన్ డిజిటల్ గేమ్స్ అయినా దాదాపు గురి పెట్టగలరు. అసలు ఫోన్ వాడకం వలన పిల్లలు ప్రపంచాన్ని చూసే దృష్టికోణం సమూలంగా మారిపోతుందన్నారు.


బిర్యానీ ఆకుల తో బరువు తగ్గవచ్చా..?

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>