Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni81608189-b4f5-4f70-a2b3-d65e5cdbd347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/dhoni81608189-b4f5-4f70-a2b3-d65e5cdbd347-415x250-IndiaHerald.jpgరిటైర్మెంట్ తరువాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రైతులా మారిన విషయం తెలిసిందే. రకరకాల పంటలు పండిస్తూ వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు. వీటితో పాటు కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు ఈ మధ్య ప్రకటించాడు. అయితే ధోనీ మొదలు పెట్టిన తరువాత ఈ కోళ్ల బిజినెస్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కడక్ నాథ్ కోళ్లు నల్లగా ..dhoni;business;ms dhoni;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;chicken;pinkధోనీ వల్ల ఆ చికెన్‌కు భారీ డిమాండ్..ధోనీ వల్ల ఆ చికెన్‌కు భారీ డిమాండ్..dhoni;business;ms dhoni;gujarat - gandhinagar;madhya pradesh - bhopal;chicken;pinkThu, 04 Mar 2021 11:52:46 GMTఇంటర్నెట్ డెస్క్: రిటైర్మెంట్ తరువాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రైతులా మారిన విషయం తెలిసిందే. రకరకాల పంటలు పండిస్తూ వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాడు. వీటితో పాటు కడక్‌నాథ్ కోళ్ల బిజినెస్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు ఈ మధ్య ప్రకటించాడు. అయితే ధోనీ మొదలు పెట్టిన తరువాత ఈ కోళ్ల బిజినెస్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. కడక్ నాథ్ కోళ్లు నల్లగా ఉంటాయి. వీటి మాంసం కూడా నలుపురంగులోనే ఉంటుంది. ఈ కోడి మాంసంలో మామూలు చికెన్ కంటే ఎక్కువ మోతాదులో పోషకాలు ఉంటాయట.

నాటుకోడి మాంసానికు తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. కానీ ఇప్పుడు దానికి పోటీగా మరో చికెన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇంతకీ ఈ కోడి పేరు ఏంటో తెలుసా..? కడక్‌నాథ్ కోడి. ఇదో ప్రత్యేక జాతి కోడి. ఇప్పుడు చికెన్ మార్కెట్లో ఈ జాతికి విపరీతమైన డిమాండ్ ఉంది.

ఈ కోడి ధోనీని ఆకర్షించింది. వీటిని చూసి ముచ్చటపడి ఓ ఫామ్ పెడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో అందరి చూపూ ఈ కోళ్లపై పడింది. ధోనిని ఆకట్టుకున్న ఈ చికెన్ సంగతేంటో చూద్దామని నెటిజెన్లు కూడా ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఈ కోడి ధర కూడా భారీగానే ఉంది. బ్లాక్ చికెన్ ధర కిలో రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉంటుంది. అంతేకాదు. కడక్‌నాథ్ కోడి బ్రీడ్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలోని గిరిజన ప్రాంతాల్లోనే మాత్రమే ఈ రకం కోడి కనిపిస్తుంది. కడక్‌నాథ్ కోళ్లను ఇప్పుడు ఇళ్ల దగ్గర కూడా పెంచుకుంటున్నారు. వీటి మాంసం కోసమే కాదు, గుడ్లు కోసం కొంతమంది పెంచుకుంటున్నారు.

మరో షాకింగ్ విషయమేంటంటే.. కడక్‌నాథ్ కోళ్ల గుడ్డు ధర ఏకంగా ఒక్కొక్కటీ 50 రూపాయిల వరకు పలుకుతుంది. ఇది కూడా నలుపు రంగులోనే ఉంటుంది. కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. అతి తక్కువగా కొవ్వు పదార్థం ఉండటమే ఈ చికెన్‌లో స్పెషల్. దానికితోడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధర ఎక్కుగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని గుడ్లు పింక్ కలర్‌లో వస్తున్నాయి.


వాళ్ళ కెరీర్ కలర్ ఫుల్ గా ఉన్నట్లేనా...?

క‌రోనాతో గుండెజ‌బ్బులు... కొత్త విష‌యం వెలుగులోకి..

పుర‌పోరు: మ‌న‌సు మార్చుకున్న తెలుగుదేశం.. ఢీ అంటే ఢీ

పుర పోరు: ప‌శ్చిమ‌లో ఆ ఒక్క మ‌హిళ‌తో టీడీపీకి తిరుగులేని ఊపు.... ఇదే హాట్ టాపిక్ ..!

పుర‌పోరు: బేరాలు.. బెదిరింపులు..దౌర్జ‌న్యాలు.. ఏక‌గ్రీవాలు

క్రిష్ పవన్ మూవీ లైన్ లోకి మరో డైరెక్టర్...?

అనుపమ పరమేశ్వరన్ రిజెక్ట్ చేసిన పది సినిమాలు ఇవే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>