MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-photos-are-leakedbb51051a-86c4-4431-a68f-60b9379ff5c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-movie-photos-are-leakedbb51051a-86c4-4431-a68f-60b9379ff5c9-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో చాల మంది ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టడం అలవాటు అయ్యింది. ఇక ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా, జాగ్ర‌త్త‌గా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ యావ‌త్ భార‌త్ సినిమానే కాదు, ప్ర‌పంచంలోని సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. tollywood;cbn;ntr;alia bhatt;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;rrr movie;cinema;media;tiger;nandamuri taraka rama rao;chitramనెట్టింట వైర‌ల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఫోటోలు..!నెట్టింట వైర‌ల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఫోటోలు..!tollywood;cbn;ntr;alia bhatt;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;rrr movie;cinema;media;tiger;nandamuri taraka rama rao;chitramThu, 04 Mar 2021 16:00:00 GMTఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ యావ‌త్ భార‌త్ సినిమానే కాదు, ప్ర‌పంచంలోని సినీ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాను లీకేజీ బాబులు వ‌ద‌ల‌డం లేదు. కొన్ని లొకేష‌న్ ఫొటోల‌ను లీక్ చేస్తున్నారు. లేటెస్ట్‌గా లీకైన పొటోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌కు సంబంధించిన ఫొటో ఒక‌టి లీక్ అయ్యింది. ఈ ఫొటో చూస్తుంటే ఎన్టీఆర్‌, పులి మ‌ధ్య జ‌రిగే ఫైట్ అని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ‘రామ‌రాజు ఫ‌ర్ భీమ్’ వీడియో చూస్తే.. అందులో ఎన్టీఆర్ ఒంటికి ర‌క్త‌మంతా పూసుకుంటూ ఉండే సీన్ ఉంటుంది. ఆ సీన్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్ సంద‌ర్భంలోనే వ‌స్తుంద‌ట‌. అడ‌విలో జ‌నాల‌ను చంపే పులిని మ‌ట్టు పెట్ట‌డానికి కొమురం భీమ్ పాత్ర‌ధారి అయిన ఎన్టీఆర్ ఒళ్లంతా ర‌క్తం పూసుకుని పులిని త‌న ద‌గ్గ‌ర‌కు ర‌ప్పించేలా చేసి దాన్ని మ‌ట్టు బెట్టే ఫైట్ ఎన్టీఆర్ ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌గా జ‌క్క‌న్న డిజైన్ చేశాడు. ఈ ఫైట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కే కాదు, యావ్ సినీ ల‌వ‌ర్స్‌కు పూన‌కాలు తెప్పించేలా డిజైన్ చేశార‌ని టాక్‌. లీకైన పొటో చూస్తున్న ఫ్యాన్స్ టైగ‌ర్ వ‌ర్సెస్ టైగ‌ర్ అని అంటున్నారు మ‌రి.

ఇక ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఇంకా అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర‌ఖని, శ్రియా శ‌ర‌న్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. సినిమాను ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.


మహేష్ బాబు బిసినెస్ ని ఫాలో అవుతున్న అల్లు అర్జున్

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??

మేడం తో పవన్ రొమాన్స్ ఫిక్స్ ... ప్రకటనే తరువాయి ...??

పుర పోరు : ఒకప్పుడు దేశంలో టాప్ మున్సిపాలిటీ.. అదే టీడీపీకి ప్లస్సా ?

అల్లు అరవింద్ ఫ్యామిలీ నుండి మరో హీరో..!?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస ఓటమికి అదే ప్రధాన కారణం..?

పుర పోరు : టీడీపీ టాప్ గేర్.. వైసీపీ జోరు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>